Honey rose : మోహన్ లాల్‏తో హానీరోజ్ అదిరిపోయే డ్యాన్స్.. ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న వీడియో..

- Advertisement -

Honey rose : హానీ రోజ్.. ఈ మధ్య ఈ పేరు తెగ వినిపిస్తుంది. బాలయ్య వీర సింహారెడ్డి సినిమాతో తెలుగు తెరకు రీ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడుకు క్రేజ్ భారీగా పెరిగిపోయింది. ఈ చిత్రంలో బాలయ్యతోపాటు.. ఈ అమ్మడు నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఈ తో హానీరోజ్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. వీరసింహ రెడ్డి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత హనీరోజ్ పేరు నెట్టింట మారుమోగింది. హానీ రోజ్ గురించి తెలుసుకోవడానికి నెట్టింట తెగ ఆసక్తి చూపించారు నెటిజన్స్. ఆమెకు సంబంధించిన ప్రతి చిన్న పోస్ట్ క్షణాల్లో వైరలయ్యింది. అటు సోషల్ మీడియాలోనూ హానీ రోజ్ సందడి తక్కువ లేదు. నిత్యం లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లకు టచ్‏లో ఉంటుంది ఈ కేరళ కుట్టి. తాజాగా ఈ అమ్మడుకు సంబంధించిన ఓ ఓల్డ్ వీడియో యూట్యూబ్‏లో తెగ వైరలవుతుంది.. మోహన్ లాల్ తో అమ్మడు వేసిన డ్యాన్స్ ట్రెండ్ అవుతుంది..

Honey Rose
Honey Rose

యూట్యూబ్‏లో ట్రెండ్ అవుతున్న ఆ వీడియోలో హానీరోజ్.. సీనియర్ హీరో మోహన్ లాల్‏తో కలిసి మజావిల్ ఎంటర్‌టైన్‌మెంట్ అవార్డ్స్ 2022 వేడుకలలో అందంగా డాన్స్ చేసింది. ఆమె డాన్స్ ప్రాక్టిస్ వీడియోతోపాటు స్టేజీపై స్టెప్పులేసిన వీడియోను జత చేసిన ఈ బ్యూటీఫుల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మోహన్‏లాల్ తో కలిసి అందంగా డాన్స్ చేసిన హానీ రోజ్ వీడియోకు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. వీరసింహ రెడ్డి సూపర్ హిట్ తర్వాత ఈ వీడియోను మరోసారి ఆడియన్స్ లైక్ చేస్తున్నారు.. షేర్స్ తో వైరల్ కూడా చేస్తున్నారు..

Honey Rose with Mohan Lal
Honey Rose with Mohan Lal

వీరసింహరెడ్డి తర్వాత హానీ రోజ్‏కు తెలుగులో అవకాశాలు రానున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు ఈ కేరళ కుట్టి. ఇటీవల విశాఖపట్నంలోని ఓ నగల దుకాణాన్ని ప్రారంభించింది హానీ రోజ్.. అయితే ఈ అమ్మడు మళ్ళీ బాలయ్యతో జత కడుతుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.. అందులో నిజమేంత ఉందో తెలియాలంటే సినిమా మొదలైయ్యేవరకు ఆగాల్సిందే..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here