Honey Rose : ప్రేమ, పెళ్లిపై హనీ రోజ్ షాకింగ్ కామెంట్స్.. ఆ ఒక్కటే చాలు..

- Advertisement -

Honey Rose : ఈ మధ్య ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు హనీ రోజ్..నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన రీసెంట్ మూవీ వీర సింహారెడ్డి సినిమాలో హీరోయిన్ హనీ రోజ్ స్పెషల్ అట్రాక్షన్ అయిన సంగతి తెలిసిందే..ఆ సినిమాతో ప్రేక్షకులను కట్టిపడేసింది.. తన అందం, అభినయంతో అందరి చూపును తనవైపు లాక్కుంది..జనం దృష్టిలో పడింది.. ఇక కుర్రాళ్లు అయితే తన అందానికి ఫిదా అయ్యారు..అప్పటినుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ వస్తోంది ఈ ముద్దుగుమ్మ.. లేటెస్ట్ ఫొటో షూట్స్ చేస్తూ సోషల్ మీడియాను ఊపేస్తుంది…ఇక ఈ అమ్మడు పెళ్లి పై ఏం చెబుతుందానని యూత్ వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే.. ప్రేమ, పెళ్లిపై తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసి అందరికి షాక్ ఇచ్చింది..అది ఇప్పుడు వైరల్ అవుతుంది..

Honey Rose
Honey Rose

ఇకపోతే..పలు షాపింగ్ మాల్స్ ఓపెన్ చేస్తూ జనాల్లో తిరుగుతోంది హానీ రోజ్. తాజాగా హైదరాబాద్ నగరంలోని ఓ రెస్టారెంట్ ఓపెనింగ్ కార్యక్రమానికి వెళ్లిన హానీ.. అక్కడ ప్రేమ, పెళ్లి గురించి ఓపెన్ కామెంట్స్ చేసింది..నటన అంటే చిన్నప్పటి నుంచే ఇష్టం అని చేవూరిన హానీ రోజ్.. 2005లోనే పరిశ్రమకు వచ్చానని, సినిమాలు తప్ప తనకు మరో పని తెలియదని చెప్పుకొచ్చింది. తాను కేరళ ఫుడ్ బాగా ఇష్టపడతా అని చెప్పిన ఈ బ్యూటీ.. పెళ్లి అనేది ఓ బాధ్యత అంటూ ఓపెన్ అయింది. అందుకే తాను ప్రతి విషయాన్ని ప్రేమిస్తానని, అంత వరకే వెళతానని తెలిపింది..

Honey Rose Photos

వీర సింహా రెడ్డి సినిమాలో సినిమాలో హనీ రోజ్ పోషించిన మీనాక్షి పాత్ర ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయింది. అందంతో పాటు నటనతో మెప్పించింది మలయాళీ కుట్టి హనీ రోజ్. వీర సింహా రెడ్డి మూవీ సూపర్ సక్సెస్ కావడంతో ఒక్కసారిగా ఫేమస్ అయింది హానీ రోజ్.. గతంలో కొన్ని సినిమాలు చేసినా కూడా అవి పెద్దగా పేరును తీసుకురాలేదు.. వీర సింహారెడ్డి సినిమాలో బాలకృష్ణ తల్లిగా, అదేవిధంగా మరదలిగా కూడా రెండు డిఫరెంట్ షేడ్స్ చూపించి ఆకట్టుకుంది హనీరోజ్. దీంతో హానీ రూపంలో సీనియర్ హీరోలకు బెటర్ జోడీ దొరికిందనే టాక్ తో ఇండస్ట్రీలో వరుస ఆఫర్లను అందుకుంటుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here