Pawan Kalyan – Trivikram : కథ చెబుతుంటే నిద్రపోయిన పవన్ కళ్యాణ్.. అది చూసి త్రివిక్రమ్ మారు మాట్లాడకుండా ఏం చేశాడంటే?

- Advertisement -


Pawan Kalyan – Trivikram : అవును ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో తెగ వైరల్ అవుతోంది. సినీ పరిశ్రమలో మాటల మాంత్రికుడిగా పేరు సంపాదించుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు టాలెంటెడ్ రచయిత .. డైరెక్టరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కు ఈయన ఎంత దగ్గరి స్నేహితుడో అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో త్రివిక్రమ్ ది ఫైనల్ డెసిషన్ అని కామెంట్లు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కోసం ఎతంటి కష్టమైన పని చేయడానికి అయినా త్రివిక్రమ్ సిద్ధంగా ఉంటాడు అంటూ పవన్ ఫ్యాన్స్ చెప్పుకొస్తూ ఉంటారు.

Pawan Kalyan - Trivikram
Pawan Kalyan – Trivikram

అలాంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు.. ఒకనొక టైంలో పవన్ కళ్యాణ్ కు ఎంతో ఇష్టంగా కథ చెబుతుంటే ఆయనేమో హ్యాపీగా గురకపెట్టి నిద్రపోయారట. అది మరేదో సినిమా కథ కాదు ఇండస్ట్రీ హిట్ అయిన అతడు సినిమాది. నిజానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ‘అతడు’ సినిమా కథను తొలుత ఉదయ్ కిరణ్ తో తీయాలనుకున్నాడట. కానీ ఆ టైంలో ఉదయ్ కిరణ్ ఫుల్ బిజీగా ఉన్నాడట.

Athadu

ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కు వివరించడానికి ఆయన గెస్ట్ హౌస్ కి వెళ్లారట. కానీ పవన్ కళ్యాణ్ ఈ కథను వింటూ నిద్రపోయారట. ఆ విషయాన్ని చూసుకోకుండా త్రివిక్రమ్ కథ చెప్తూనే ఉన్నాడట. దాదాపు కథ మొత్తం అయిపోయిన తర్వాత తిరిగి చూస్తే ఆయన నిద్రపోతూ కనిపించాడట. అది చూసి మొదట నవ్వుకొని.. ఆ తర్వాత చాలా హర్ట్ అయ్యారట. తర్వాత వెళ్లి ఈ కథను మహేష్ బాబుకు వివరించి ఒప్పించి.. ఆయనతో చేసి హిట్ ట్రాక్ అందుకున్నాడు. ఈ సినిమా త్రివిక్రమ్ – మహేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అయింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here