Hit 2 Review : క్రైమ్ థ్రిల్లర్ కథ..అదిరిపోయే ట్విస్ట్ లు..బొమ్మ హిట్..

- Advertisement -

Hit 2 Review : సైలెంట్ గా సినిమాలు చేస్తూ వరుస విజయాలను అందుకుంటున్న హీరో అడవి శేషు ఇప్పుడు మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు…మొదటి నుంచి థ్రిల్లర్ జొనర్ లో వచ్చిన సినిమాలు అన్నీ కూడా భారీ విజయాన్ని అందుకున్నాయి.అదే జోనర్ లో ఇప్పుడు మరో సినిమాను చేశాడు.దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన Hit 2 Review నేడు విడుదలైంది. హిట్ 2 ప్రీమియర్స్ ముగియగా టాక్ ఎలా ఉందో చూద్దాం రండి..

సంజన అనే ఒక యంగ్ గర్ల్ మర్డర్ కి గురవుతుంది. ఆ మర్డర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా అడివి శేష్ రంగంలోకి దిగుతాడు. సంజనను హత్య చేసిన వ్యక్తిని పట్టుకోవడం తనకు చాలా సులభం అని మొదట అడివి శేష్ భావిస్తాడు. అయితే కిల్లర్ అడివి శేష్ కి అడుగడున సవాల్ విసురుతూ ఉంటాడు. అసలు చనిపోయింది సంజన మాత్రమే కాదు. సంజన డెడ్ బాడీ కొందరు అమ్మాయిల శరీర భాగాల సమాహారం అని తెలుసుకొని నివ్వెర పోతారు. అసలు ఎవరీ సీరియల్ కిల్లర్? అమ్మాయిలను ఎందుకు చంపుతున్నాడు? హీరో అతన్ని పట్టుకున్నాడా? పట్టుకునేందుకు హీరో వేసిన ప్లాన్స్ ఏంటి? అనేది సినిమా కథ..

Hit 2 Movie Review
Hit 2 Movie Review

మాస్ హీరో విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన హిట్ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమాను తెరకెక్కించారు.. అడవి శేషు కు థ్రిల్లర్ సినిమాలు మంచి విజయాన్ని అందించాయి..దాంతో ఈ సినిమాను ఎంచుకున్నాడు. అందరు చూపించిన విధంగా కాకుండా సరికొత్తగా వరుస సస్పెన్స్ లను చూపిస్తూ డైరెక్టర్ సినిమాను మరో కోణంలోకి తీసుకెళ్ళాడు.అయితే అతను హిట్ ను అందుకున్నాడా?..

- Advertisement -

ప్రీమియర్ టాక్ ద్వారా చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తుంది. మొదటి భాగం మొత్తం సెటప్ కి వాడేశాడు దర్శకుడు. అమ్మాయి మర్డర్ జరుగుతుంది. అది ఎవరు చేశారనే కోణంలో కథ సాగుతుంది. ఇంటర్వెల్ వరకు సినిమా అదే టెంపోలో నడుస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ పర్లేదు. ఫస్ట్ హాఫ్ సినిమా యావరేజ్ గా ఉంటుంది. ప్రేక్షకుడు కిల్లర్ ఎవరనే సస్పెన్సు మాత్రం ఫీల్ అవుతాడు..కానీ అతడిని చూపించరు.

సెకండ్ హాఫ్ లో అసలు కథను రివిల్ చేస్తారు.. హంతకుడు ఎవరూ అనేది ఓపెన్ చేస్తారు.ఫస్ట్ హాఫ్ కి మించి సెకండ్ హాఫ్ ఉంది. కథలో భాగంగా వచ్చే మలుపులు అలరిస్తాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ సినిమాకు బలం. విలన్ ఎవరు? అతడు అమ్మాయిలను చంపడం వెనుక కారణం ఏమిటనేది? ఆడియన్స్ కి చెప్పుకోదగ్గ అనుభూతి పంచుతాయి. కిల్లర్ ని రివీల్ చేసిన సీన్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

హిట్ 2 క్లైమాక్స్ లో అదొక ఇంట్రెస్టింగ్ పాయింట్ గా చెప్పవచ్చు. అడివి శేష్ నటన సినిమాకు ప్లస్ అయ్యాయి. దర్శకుడు రాసుకున్న కథ పర్లేదు. స్క్రీన్ ప్లే బాగుంది. బీజీఎమ్ అంతగా ఆకట్టుకోలేదన్న మాట వినిపిస్తుంది. హీరోయిన్ మీనాక్షి చౌదరి తన పాత్ర పరిధిలో ఆకట్టుకున్నారు..ఇక ఇందులో నటించిన ప్రతి ఒక్కరూ వారి పాత్రకు న్యాయం చేశారు..మొత్తానికి సినిమా హిట్ అయ్యింది..నిర్మాతగా నానీ మంచి సక్సెస్ ను అందుకున్నాడు..ఈ సినిమాకు సీక్వెల్ గా హిట్ 3 ని కూడా తీసుకురానున్నారని తెలుస్తుంది..ఈ సినిమాకు 3 రేటింగ్ ను ప్రేక్షకులు ఇస్తున్నారు.ఇక ఈ సినిమా ఎంత కలెక్షన్లను రాబడుతుందో చూడాలి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here