సన్యాసం తీసుకున్న స్టార్ హీరోయిన్ కాజోల్ .. షాక్ లో ఫ్యాన్స్

- Advertisement -

కాజోల్ ‘‘దిల్‌వాలే దుల్హేనియా లేజాయేంగే’ సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు కాజోల్. ఈ సినిమాతో హిందీలో స్టార్‌ హీరోయిన్‌ అయిపోయారు. తర్వాత వరుస సినిమాలతో దశాబ్ధానికిపైగా స్టార్‌ హీరోయిన్‌గా కొనసాగారు. హీరోయిన్‌గా టాప్‌ ఉన్న సమయంలోనే అజయ్‌ దేవ్‌గణ్‌తో ప్రేమలో పడ్డారు. ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఓ బాబు, ఓ కూతురు ఉన్నారు. కాజోల్‌ ప్రస్తుతం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ ఉన్నారు.

కాజోల్
కాజోల్

కొద్దిరోజుల క్రితం కాజోల్‌ ప్రముఖ బాలీవుడ్‌ నటి ఇషిత దుత్తా బేబీ షోయర్‌ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె పసుప పచ్చ చొక్కా..దానికి తగ్గ ప్యాంట్స్‌తో పాటు మెడలో రుద్రాక్ష మాలలతో దర్శనమిచ్చారు. ఫంక్షన్‌ జరుగుతున్న దగ్గరకు వచ్చిన పాపరజీలు ఆమెను వీడియో తీశారు. ఆ వీడియో కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన ఆ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూన్నారు. సన్యాసం తీసుకున్నారా అని అంటున్నారు.

‘‘ కాజోల్‌ బాబాకు జై..’’ .. ‘‘ కాజోల్ ఏక్తా కపూర్‌ను స్పూర్తిగా తీసుకున్నట్లు ఉంది’’.. ‘‘ కాజోల్‌ ఎల్లో కర్టెన్‌ను ధరించింది’’.. ‘‘ కాజోల్‌ అచ్చం లేడీ బాబా లాగా ఉంది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. సినీ సెలెబ్రిటీల నడక, నడత, మాటలు, డ్రెస్సింగ్‌ స్టైల్‌ వంటి ప్రతీదాన్ని బూతద్దంలో పెట్టి చూస్తుంటారు. ట్రోలింగ్‌ చేయటానికి కాదేదీ అనర్హం అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు. అందుకే హీరోయిన్‌ కాజోల్‌ లుక్‌పై కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తూ ఉన్నారు. బాబా వేషంలా ఉన్న ఆమె వేషధారణపై వ్యంగ్యంగా ట్రోల్స్‌ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here