నా దరిద్రం వల్లే ఏజెంట్ ఇలా పోయింది.. అయినా ఊరుకోను: అఖిల్

- Advertisement -

అఖిల్ ఏజెంట్ మూవీ ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్‌గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. భారీ అంచ‌నాల‌తో ఏప్రిల్ 28న థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ సినిమా అఖిల్‌తో పాటు ప్రొడ్యూస‌ర్స్‌కు షాక్ ఇచ్చింది. థియేట‌ర్ల‌లో ప‌ది కోట్ల క‌లెక్ష‌న్స్ కూడా రాబ‌ట్ట‌లేక‌పోయిపోయింది. ఓవ‌రాల్‌గా థియేట్రిక‌ల్ ర‌న్ ద్వారా ఈ సినిమాకు 13.50 కోట్ల గ్రాస్, ఆరు కోట్ల ఇర‌వై ఐదు ల‌క్ష‌లకుగా షేర్ వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ఇక తాజాగా అఖిల్ ఈ సినిమా ఫలితంపై స్పందించారు.

అఖిల్
అఖిల్

‘‘ఏజెంట్‌’ చిత్రబృందానికి, ఆ సినిమా తెరకెక్కించడంలో తమ జీవితాలను అంకితం చేసిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు. ఎంతో కష్టపడినప్పటికీ దురదృష్టవశాత్తు మేము అనుకున్నదాన్ని స్క్రీన్‌పైకి తీసుకురాలేకపోయాం. ఆ విధంగా మంచి చిత్రాన్ని అందించలేకపోయాం. నాకెంతో అండగా నిలిచిన చిత్ర నిర్మాత అనిల్‌కు కృతజ్ఞతలు. మా చిత్రాన్ని నమ్మిన డిస్ట్రిబ్యూటర్లు, సపోర్ట్‌ చేసిన మీడియాకు ధన్యవాదాలు. అభిమానులు, శ్రేయోభిలాషులు ఇస్తున్న ప్రేమ వల్లే నేను కష్టపడి వర్క్‌ చేస్తున్నా. నాపై నమ్మకం పెట్టుకున్న వారి కోసం మరింత దృఢంగా సిద్ధమై మళ్లీ వస్తాను’’ అని అఖిల్‌ పేర్కొన్నారు.

స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ మూవీకి సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. దేశంలో ఉగ్ర‌దాడుల‌కు ధ‌ర్మ (డినో మోరియో) అనే క్రిమిన‌ల్ ప్లాన్ చేస్తాడు. అత‌డిని రామ‌కృష్ణ (అఖిల్‌) స‌హాయంతో రా ఛీఫ్ మ‌హ‌దేవ్ (మ‌మ్ముట్టి) ఎలా పట్టుకున్నాడ‌న్న‌దే ఏజెంట్ మూవీ క‌థ‌. ఈ సినిమా కోసం అఖిల్ సిక్స్ ప్యాక్ చేశాడు. యాక్ష‌న్ రోల్‌కు త‌గ్గ‌ట్టుగా కంప్లీట్ మేకోవ‌ర్ అయ్యాడు. కానీ పేల‌వ‌మైన‌ క‌థ‌, క‌థ‌నాల కార‌ణంగా అత‌డి మూడేళ్ల‌ శ్ర‌మ మొత్తం వృథాగా మారింది. ఈ సినిమా ద్వారా సాక్షి వైద్య హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మ‌మ్ముట్టి కీల‌క పాత్ర‌ను పోషించారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here