Charmi Kaur దారణంగా హీరోయిన్‌ చార్మి జీవితం.. పూరి వల్ల మొత్తం నాశ‌నం అయ్యింది.!Charmi Kaur : స్టార్ హీరోయిన్స్ గా కెరీర్ లో దూసుకుపోతున్న సమయం లో కొంతమంది హీరోయిన్లు నిర్మాణ రంగం లోకి అడుగుపెట్టి చేతులు కాల్చుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అలనాటి మహానటి సావిత్రి ఈ కోవకు చెందిన మనిషే. ఆ తర్వాత సిల్క్ స్మిత కూడా ఇలాగే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ని ఒక ఊపు ఊపుతున్న సమయం లో సినిమాలను నిర్మించి అప్పులపాలై ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడింది.

Charmi Kaur

అయితే అందరూ ఇదే కోవకి చెందిన వాళ్ళు అని చెప్పలేము, నిర్మాతలుగా కూడా సక్సెస్ అయిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. నేటి తరం హీరోయిన్స్ కూడా ఇలా సినిమా నిర్మాణం లోకి అడుగుపెట్టిన వాళ్ళు ఉన్నారు, వాళ్లలో చార్మ్ కౌర్ ఒకరు..2002 వ సంవత్సరం లో విడుదలైన ‘నీ తోడు కావాలి’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైనా ఛార్మి ఆ తర్వాత పలు తమిళం , కన్నడ సినిమాలలో హీరోయిన్ గా చేసింది.

Actress Charmi Kaur

ఆ తర్వాత కృష్ణ వంశీ – నితిన్ కాంబినేషన్ లో వచ్చిన శ్రీ ఆంజనేయం అనే సినిమా ద్వారా పాపులారిటీ ని సంపాదించిన ఛార్మి గౌరీ , మాస్ , చక్రం , లక్ష్మి మరియు మంత్ర వంటి సినిమాల ద్వారా పేరు ప్రఖ్యాతలు బాగానే సంపాదించింది..కానీ ఈమె కెరీర్ లో సూపర్ హిట్ అయిన సినిమాల కంటే ఫ్లాప్ అయ్యినవే ఎక్కువ.

నేటి తరం స్టార్ హీరోలలో ఈమె ప్రభాస్ మరియు ఎన్టీఆర్ తో తప్ప ఎవరితో నటించలేదు,అందం అభినయం ఉన్నప్పటికీ కూడా స్టార్ హీరోలు ఈమెకి పెద్దగా అవకాశాలు ఇవ్వకపోవడం ఆశ్చర్యం..ఆ తర్వాత పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసిన ఈమెకి పెద్ద సక్సెస్ రేట్ రాలేదు..అనుష్క మరియు నయనతార వంటి స్టార్ హీరోయిన్స్ లాగ ఈమెకి సక్సెస్ రేట్ రాలేదు..మంత్ర అనే ఒక్క సినిమా మాత్రమే బాగా ఆడింది.ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వం లో జ్యోతి లక్ష్మి అనే సినిమా చేసింది.

ఈ చిత్రం లో ఛార్మి టైటిల్ పాత్రని పోషిస్తునే నిర్మాతగా కూడా వ్యవహరించింది.ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజి గా ఆడింది, కమర్షియల్ గా కాస్త వర్కౌట్ అవ్వడం తో పూరి జగన్నాథ్ తో కలిసి సినిమాలు నిర్మించడం ప్రారంభించింది..ఏ ముహూర్తం లో వీళ్లిద్దరు కలిసారో కానీ,వీళ్ళ నిర్మాణం లో వచ్చిన సినిమాలన్నీ ఒక దానిని మించి ఒకటి డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి..ఆ సమయం లో హీరో రామ్ తో ‘ఇస్మార్ట్ శంకర్’ అనే సినిమా తీశారు.ఈ చిత్రం చాలా పెద్ద హిట్ గా నిలిచింది, అప్పటి వరకు వరుస ఫ్లాప్స్ తో తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కున్న ఛార్మి – పూరి జగన్నాథ్ ఈ సినిమా తో మొట్టమొదటిసారి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని చూసారు.

ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడం తో విజయ్ దేవరకొండ హీరో గా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో లైగర్ అనే సినిమా చేసారు..ఈ చిత్రం ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు..పూరి జగన్నాథ్ మరియు ఛార్మి ఈ సినిమాకోసం ఫైనాన్షియర్స్ దగ్గర కోట్ల రూపాయిల అప్పులు చేసారు..సినిమా డిజాస్టర్ అయ్యేలోపు ఆ అప్పులు కట్టుకోలేక చాలా తీవ్రమైన ఆర్ధిక సంక్షోభం లోకి వెళ్లిపోయారట.లైగర్ ప్రొమోషన్స్ లో ఛార్మి తినడానికి తిండి కూడా లేని పరిస్థితి ఏర్పడింది.. చేతిలో రూపాయి కూడా లేని పరిస్థితులను ఎదురుకున్నాను అంటూ ఆమె కష్ట కాలం ని తల్చుకుంటూ ఏడ్చిన సంగతి అందరికీ తెలిసిందే.ఇప్పుడు ఆమె మరోసారి అదే పరిస్థితి కి వెళ్ళిపోయినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.ఈ సినిమా దెబ్బకి ఆమె ప్రొడక్షన్ నుండి తప్పుకొని మళ్ళీ నటించడానికి ఆసక్తి చూపిస్తుందా, లేదా అనేది చూడాలి.

Tags: