Anjali : అయ్యోపాపం..అంజలి అంత నొప్పిని భరించిందా..?

- Advertisement -

తెలుగు అమ్మాయి హీరోయిన్ Anjali గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు..షాపింగ్ మాల్, జర్నీ సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది అంజలి.. నిజానికి ఈ అమ్మడు తెలుగు హీరోయిన్ అయినప్పటికీ కూడా ఇక్కడ అవకాశాలు లేక పోవడంతో తమిళ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయ్యింది.

అక్కడి సినిమాల ద్వారా ఫేమస్ అవడంతో తెలుగులో కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మసాలా,బలుపు, గీతాంజలి వంటి సినిమాల్లో నటించింది అలాగే పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన వకీల్ సాబ్ సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో నటించి మెప్పించింది.. ఇక మళ్ళీ ఇక్కడ అవకాశాలు అందని ద్రాక్షలా మారాయి దాంతో ఐటమ్ సాంగ్స్ చేస్తుంది..అప్పుడు పడిన ఇబ్బందుల గురించి ఓ ఇంటర్వ్యూ లో చెప్పి బాధపడింది..

Anjali
Anjali

ఇక విషయానికొస్తే..అంజలి మాట్లాడుతూ.. సినిమాలో రాణించడం కోసం నేను ఎలాంటి ఇబ్బందికరమైన పాత్రలో అయినా చేయగలిగాను. అంతేకాదు సినిమాల కోసం కొంతమంది నచ్చని వ్యక్తులతో ఇంటిమేట్ సన్నివేశాల్లో,ముద్దు సన్నివేశాలలో నటించి చాలా ఇబ్బంది పడ్డాను.ఇక ఆ విషయంలో కొన్ని కొన్ని సందర్భాలలో నేను చేసిన పని నాకే నచ్చక క్యారావాన్ లోపలికి వెళ్లి బాగా ఏడ్చే దాన్ని. ఇష్టం లేని వాళ్ళతో ఎన్నో శృంగార సన్నివేశాల్లో కూడా నటించాను. కానీ అలాంటి పరిస్థితిలో నా బాధ ఎవరికి చెప్పుకోలేక నాలో నేనే బాధపడేదాన్ని. ఇక సినిమా హిట్ అవ్వాలంటే అందులో ఉన్న సన్నివేశాలను కచ్చితంగా చేసి తీరాలి.. ఇక మొదటి సినిమాతోనె జై తో ప్రేమలో పడింది..

- Advertisement -

అలా చాలా రోజులు ప్రేమించుకున్నారు.. ఆ మధ్య ఇద్దరు పెళ్లి కూడా చేసుకుంటారని వార్తలు వినిపించాయి. కానీ జై అంజలి కి ఎలాంటి అవకాశాలు రాకుండా ఆమె దగ్గర ఉన్న డబ్బులు మొత్తం కాజేసి ఆమెను మోసం చేశాడు. అంతే కాదు ఏదైనా సినిమాలో అంజలి హీరోయిన్ గా చేయాలంటే ముందు జై పర్మిషన్ కావాల్సిందే. ఇలా అంజలి సినీ కెరియర్ ని మొత్తం దెబ్బతీసి ఆమె జీవితం నాశనం చేశారు. ఇక ఈ విషయాన్ని కాస్త లేటుగా తెలుసుకున్న అంజలి తనకి దూరంగా ఉంటేనే మంచిది అని భావించి బ్రేకప్ చెప్పింది..

Anjali and Actor Jai
Anjali and Actor Jai

ప్రస్తుతం ఆమె సింగిల్ గా ఉంది..రామ్ చరణ్ హీరోగా వస్తున్న ఆర్సి 15 సినిమాలో ఒక కీలకమైన పాత్ర ఉంది. ఇందులో అంజలి ఫ్లాష్ బ్యాక్ లో రామ్ చరణ్ కి భార్య గా నటిస్తున్నట్లు ఇప్పటికే ఇంటర్నెట్లో చక్కర్లు కొట్టిన కొన్ని ఫోటోలు చూస్తే అర్థమవుతుంది. ఇక ఈ సినిమాకి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు..భారీ అంచనాలతో ఈ సినిమా తెరకెక్కుతుంది..దాంతో సినిమా హిట్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here