Venu Swamy : మరికొద్దిరోజుల్లో మెగా ఇంటికి రాబోతున్న వారసుడు.. వేణు స్వామి లెక్క కరెక్టేనా

- Advertisement -


Venu Swamy ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యంలో ఉన్న పేరు. సెలబ్రిటీల జాతకాలు చెబుతూ ఆయన వైరల్ అయిపోయారు. వేణు స్వామి తెలుగు సిని ఇండస్ట్రీలో ఇప్పటికే చాలామంది సెలబ్రిటీల జాతకాలను చెప్పేశాడు. అలాగే టాలీవుడ్ సంబంధించిన కొంతమంది సెలబ్రిటీలు ఎందుకో తెలీదు కానీ బాగా నమ్ముతారు.

Venu Swamy
Venu Swamy

ఇక ఈ వేణు స్వామి సెలబ్రిటీల గురించి చెప్పిన మాటలు చాలా సందర్భాల్లో నిజం కావడంతో.. ఒక్కసారిగా ఆయన లైమ్ లైట్లోకి వచ్చాడు. ముఖ్యంగా అక్కినేని నాగచైతన్య, సమంతల విడాకుల విషయంలో ఆయన త్వరలోనే వీరిద్దరు విడాకులు తీసుకుంటారు అంటూ వేణు స్వామి మొదటలో చెప్పుకొచ్చాడు. ఇదే తర్వాత నిజమైంది.

అయితే వేణు స్వామి ఇలా చెప్పడంతో అభిమానులంతా ఆయన పై మండిపడ్డారు. కొన్నాళ్లు గడిచిన తర్వాత వేణు స్వామి ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు. ఈ క్రమంలో చాలా మంది సెలబ్రెటీలపై వేణు స్వామి జాతకాలు చెబుతూ రోజు రోజుకు తన ప్రభావాన్ని పెంచుకుంటున్నాడు.

- Advertisement -

కొంతమంది సెలబ్రిటీస్ వేణు స్వామి దగ్గరకు వెళ్లి మరి జాతకాలు చూపించుకుని.. ప్రత్యేక పూజలు చేపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే కొన్నిసార్లు జాతకాలు విఫ‌లం అవడంతో వేణు స్వామి పై సోషల్ మీడియాలో భారీ రేంజ్ లో ట్రోల్స్ నమోదవుతున్నాయి. అయినా వేణు స్వామి ఏమాత్రం తగ్గడం లేదు. తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ సెలబ్రిటీలు కూడా ఇప్పటికీ వేణు స్వామిని కలుస్తూనే ఉంటారు.

ఇటీవల కాలంలో వేణు స్వామి పలు టీవీ షోలలో, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఇలా వేణు స్వామి ఇంటర్వ్యూ ఇచ్చిన న్యూస్ ఛానల్ లో ఎవరో సెలబ్రిటీ గురించి ఖచ్చితంగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ హాట్ టాపిక్ అవుతున్నాడు.

ఈ నేపథ్యంలో తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వేణు స్వామి.. మెగాస్టార్ ఫ్యామిలీ గురించి చేసిన‌ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగా ఫ్యామిలీలో మరో 10 నెలల్లో వారసుడు రాబోతున్నాడు అంటూ వివరించాడు. అది కూడా రామ్ చరణ్ – ఉపాసన జంటకు వారసుడు పుట్టబోతున్నాడంటూ చెప్పాడు. దీంతో మెగా అభిమానులంతా వేణు స్వామి చెప్పినది నిజం కావాలని.. ఆ ఇంటికి ఓ వారసుడు పుట్టాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here