Hebah Patel అబ్బా.. హెబ్బా.. ఈ పేరు వినగానే అబ్బాయిల రియాక్షన్ ఇదే.. ఇందులో సందేహం లేదు..టాలివుడ్ లో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుని తక్కువ సమయంలోనే భారీగా ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోయిన్ హెబ్బా పటేల్. కుమారి 21F తో తెలుగు కుర్రాళ్ల గుండెలు కొల్లగొట్టిన ఈ బ్యూటీ తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేక పోయాయి..దీంతో హెబ్బాకు సినిమా అవకాశాలు అందని ద్రాక్షల మారాయి..దాంతో సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్ చేస్తూ యువతను ఆకర్శించింది..తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది..ఆ ఫోటోలలో హెబ్బా బుర్ఖా వేసుకుంది.. అసలు ఎందుకు బుర్ఖా వేసుకుంది.. ముస్లిం నా లేక సీక్రెట్ గా ముస్లిం ను పెళ్లి చేసుకుందా అని రకరకాల చర్చలు జరుగుతున్నాయి..
ఐటమ్ సాంగ్స్ చేసి మెప్పించింది. చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూ వస్తోన్న ఈ అమ్మాయి.. చివరిసారిగా ఒదేల రైల్వే స్టేషన్ లో నటించింది. ఈ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ మూవీ తర్వాత హెబ్బాకు అవకాశాలు కరువయ్యాయి. చాలా కాలంగా ఆమె నుంచి మరో ప్రాజెక్ట్ అప్డేట్ రాలేదు. తాజాగా హెబ్బాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. ఇప్పటివరకు తెలియని విషయం ఏంటంటే.. హెబ్బా పటేల్ ముస్లిం అనే విషయం. తాజాగా ఆమె బురఖా ధరించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి..
ఇప్పుడు పవిత్ర రంజాన్ మాసం కావడంతో ఆమె బురఖా ధరించిన ఫోటోస్ ఇన్ స్టాలో షేర్ చేసింది. దీంతో నెటిజన్స్ షాకవుతున్నారు. హెబ్బా ముస్లిమా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆమె పేరులో పటేల్ ఉండడంతో చాలా మంది ఆమెను గుజరాతీ హిందువని అనుకున్నారు ఇన్నాళ్లు. ఇక తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలతో క్లారిటీ వచ్చింది..ఈ అమ్మడు 1989 జనవరి 6న ముంబైలో జన్మించింది హెబ్బా పటేల్. ముంబైలోని సోఫియా కాలేజ్ ఫర్ ఉమెన్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఈ అమ్మడు.. 2014లో కన్నడ చిత్రం అద్యక్షతో నటనారంగంలో ప్రవేశించింది. ఆ తర్వాత తిరుమనం ఎనుమ్ నిక్కా తో తమిళ్ సినీఇండస్ట్రీకి పరిచయం అయ్యింది..ఆ తర్వాత సినిమాల గురించి అందరికి తెలుసు.. అయితే ఇప్పుడు బుర్ఖా విషయం మాత్రం చర్చనీయాంశంగా మారింది.. ముస్లిం అయ్యి ఇలా సినిమాలు చేసిందా.. కొంచెం కూడా బుద్ది లేదు అంటూ కామెంట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది.. అసలు విషయం ఏంటో ఈ అమ్మడు నోరు విప్పాల్సిందే..