Prabhas: బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ ఆకాశాన్నంటింది. ఒక్క సినిమాతోనే ప్రభాస్ వరల్డ్ వైడ్ ఫ్యాన్ బేస్‌ను తెచ్చిపెట్టింది. అప్పటి నుంచి ప్రభాస్ తీసే ప్రతి సినిమా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అవుతున్నాయి. బాహుబలి సినిమా తర్వాత విడుదలైన ప్రతి సినిమా ఫ్లాపులు అవుతున్నాయి. దీంతో ఆయన ఫ్యాన్స్ కొంత అసహనం పాలయ్యారు. దీంతో ప్రభాస్ నెక్ట్స్ మూవీ సలార్ పైన భారీ అంచనాలు ఉన్నాయి. అది కాకుండా ప్రభాస్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాల్లో బిజీగా ఉంటున్నాడు. కంటిన్యూ షూటింగ్స్ కారణంగా ఇటీవల ప్రభాస్ మోకాలు నొప్పి భారిన పడ్డాడు.
కొంతకాలం నుంచి తీవ్రమైన మోకాళ్ల నొప్పితో బాధపడుతున్న ప్రభాస్ డాక్టర్ ను సంప్రదించాడు. ఆయన సలహా మేరకు డిసెంబర్ వరకు ‘కల్కి 2898’ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని తర్వాత అమెరికా వెళ్లి న్యూయార్క్‌లో ఒక పెద్ద హాస్పిటల్లో మోకాలికి ఆపరేషన్ చేయించుకోబోతున్నాడు. ప్రస్తుతం ఈ వార్త సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఇక ఈ సర్జరీ తర్వాత కనీసం సంవత్సరంన్నర పాటు ప్రభాస్ కు విశ్రాంతి అవసరమని తెలుస్తోంది. దీంతో ఈ ఏడాదిన్నర పాటు ప్రభాస్ సినిమాలకు అంతరాయం ప్రకటించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే ‘కల్కి 2898’తో పాటు ప్రభాస్ మరో మూడు సినిమాలకు కమిట్ మెంట్ ఇచ్చాడు. తదుపరి మారుతి దర్శకత్వంలో హారర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ప్రభాస్. ఆ సినిమా తర్వాత దర్శకుడు సందీప్ వంగాతో స్పిరిట్ అలానే బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా లెవెల్ మూవీకి కమిట్ అయ్యాడు. కానీ ప్రస్తుతం ప్రభాస్ సర్జరీ దృష్ట్యా ఈ మూడు సినిమాల షూటింగ్ కు ఏడాదిన్నర జాప్యం జరగనుంది.