కుర్ర హీరోకు సెట్ అయిన సంయుక్త.. త్రివిక్రమే సెట్ చేశాడా ఏంటీ?

- Advertisement -

వరుస సినిమాలతో లక్కీ గర్ల్ ముద్ర వేసుకుంది సంయుక్త మీనన్. ఇటీవలే సాయి తేజ్ తో కలిసి విరూపాక్ష లాంటి బంపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌ రేంజ్ కు వెళ్లింది. వరుస హిట్లు రావడంతో దర్శక నిర్మాత చూపు ఈ అమ్మడి పై పడింది. మా సినిమాలో నటించాలంటూ అమ్మడి ఇంటి ముందు క్యూ కడుతున్నారు. అయితే వచ్చిన ఆఫర్లన్నింటికీ ఓకే చెప్పకుండా ఆచీ తూచీ అడుగులేస్తుంది. తనకు ప్రాధాన్యం ఉన్న కథలకే ఓకే చెబుతుంది. దీంతో బ్యూటీ విత్ బ్రెయిన్ అని అమ్మడిని తెగ పొగిడేస్తున్నారు.

సంయుక్త
సంయుక్త

విరుపాక్ష సినిమా సంయుక్త నటనకు మంచి మార్కుల పడ్డాయి. దీంతో కోట్లాది మంది ఆమెకు అభిమానులుగా మారిపోయారు. ఇక ఇటీవల కార్తికేయ 2తో పాన్ ఇండియా బ్లాక్ బాస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్న నిఖిల్ సరసన సంయుక్త మీనన్ స్వయంభు సినిమాలో నటించబోతుందన్న న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ఠాగూర్ మధు – నిఖిల్ కాంబినేషన్ లో తెరకెక్కనుంది ఈ సినిమా. నిఖిల్ లాస్ట్ మూవీ స్పై బాక్సాపీసు వద్ద ఫ్లాప్ అవడంతో ఈ సినిమాపై నిఖిల్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. భారీ కథతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఈనెల 18న సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ నెల 18న‌ ముహూర్తం ఫిక్స్ చేసి వెంటనే షూటింగ్ చేయడానికి టీం రెడీ అవుతుందని సమాచారం. ఈ న్యూస్ బయటకు రావడంతో సంయుక్తను అందులో హీరోయిన్ గా స్వయంభూ మూవీ టీం ఎంపిక చేసిందని టాక్.. అయితే సినిమాల పరంగా మొదటి నుంచి సంయుక్తను ఎంకరేజ్ చేస్తున్న త్రివిక్రమ్‌మే ఈ చిత్రానికి కూడా సంయుక్తను సిఫార్సు చేశారా..? అని పలువురు నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here