Hansika : ఆపిల్ బ్యూటీ హన్సిక గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. దేశముదురు సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.. ఆ తరువాత వరుస సినిమా ఆఫర్లు కట్టాయి ఈ అమ్మడు అందానికి.. దాంతో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ చిత్రాలలో కూడా నటించి మెప్పించింది.. కాగా గత ఏడాది డిసెంబర్ 4న తన చిన్ననాటి ఫ్రెండ్ సోహైల్ కతూరియను పెళ్లి చేసుకుంది..
హన్సిక , సోహైల్ కి కామన్ ఫ్రెండ్ రింకీ.. సోహైల్ గతంలో రింకీ ని పెళ్లి చేసుకున్నారు. ఆ పెళ్లికి హన్సిక కూడా హాజరైంది.. అంతేకాదు వారి పెళ్లి ని ఎంజాయ్ చేస్తూ డాన్స్ స్టెప్పులు కూడా వేసింది.. ఇప్పుడు ఆ పెళ్లి వీడియోలో హన్సిక డాన్స్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి సోహైల్ విడాకులకు కారణం హన్సిక అంటూ పలు విమర్శలు వచ్చాయి. ఫ్రెండ్ ని మోసం చేసి తన భర్తని చేసుకున్న సవతి అంటూ సోషల్ మీడియాలో రకరకాల వార్తలు హన్సిక జంటపై వచ్చాయి..
ఈ విషయంపై హన్సిక, సోహైల్ లవ్ షాది డ్రామా ద్వారా క్లారిటీ ఇచ్చారు. తన భర్తకు సంబంధించిన పలు విషయాలను హన్సిక తెలిపింది. వీరి ప్రేమ పెళ్లికి సంబంధించిన విషయాలతో లవ్ షాది డ్రామా అనే వీడియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వీడియోలో హన్సిక సోహెల్ కు ఇదివరకే పెళ్లయిన విషయాన్ని తెలిపింది. వాస్తవానికి తమ పెళ్లి గురించి ఎలాంటి విషయాలు బయటకు రాకుండా చూసుకోవాలని అనుకుందట. కానీ ఆ విషయం అందరికీ తెలిసిపోయింది.
నిజానికి సోహెల్ కు గతంలో పెళ్లయిందనే విషయం నాకు తెలుసు. వారికి కోర్టు ద్వారా విడాకులు వచ్చిన తర్వాతే మేము పెళ్లి చేసుకున్నాం. అంతేకాదు గతంలో నేను కూడా ఒకరితో రిలేషన్ లో ఉన్నాను. ఆ విషయం అందరికీ తెలుసు. మళ్లీ అలాంటి సంబంధాన్ని కొనసాగించాలని అనుకోలేదు. ఇద్దరం ఒకరి గురించి మరొకరం తెలుసుకున్న తర్వాతే పెళ్లి చేసుకున్నాం. సోహైల్ నా జీవితంలోకి వచ్చిన క్షణాలు చాలా స్పెషల్.. అని హన్సిక తెలిపింది. నా విడాకులకు హన్సిక కారణం కాదని సోహైల్ కూడా తెలిపారు.