Hamsa Nandini హీరోయిన్ గా స్టార్ కాలేకపోయినప్పటికీ విభిన్నమైన పాత్రలు పోషించి, మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి హంసా నందిని.క్రియేటివ్ డైరెక్టర్ వంశీ తెరకెక్కించిన ‘అనుమానాస్పదం’ అనే చిత్రం ద్వారా వెండితెర కి హీరోయిన్ గా పరిచయమైనా హంసా నందిని ఆ తర్వాత ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా, సెకండ్ హీరోయిన్ గా క్యారక్టర్ ఆర్టిస్టుగా మరియు స్పెషల్ ఐటెం సాంగ్స్ ద్వారా బాగా ఫేమస్ అయ్యిండి.అయితే 2018 వ సంవత్సరం లో గోపీచంద్ హీరో గా నటించిన ‘పంతం’ అనే సినిమా తర్వాత ఆమె వెండితెర మీద కనిపించట్లేదు.

అందుకు కారణం ఆమె ‘క్యాన్సర్’ భారిన పడటమే.గత కొంతకాలం నుండి క్యాన్సర్ చికిత్స తీసుకుంటూ మృత్యువుతో అలుపెరగని పోరాటం చేసిన హంసా నందిని మొత్తానికి క్యాన్సర్ నుండి తప్పించుకొని బయటపడింది.ఇప్పుడు ఆమె వరుసగా సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటూ బిజీ గా మారిపోయింది.ఇది ఇలా ఉండగా క్యాన్సర్ భారిన పడి ఆమె పోరాడుతున్న సమయం లో ఆమె ఎదురుకున్న కష్టాలను ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది హంసా నందిని.

ఆమె మాట్లాడుతూ ’18 సంవత్సరాల క్రితం మా అమ్మకు రొమ్ము క్యాన్సర్ అని తెలిసింది,ఆమె ప్రాణాలను కాపాడేందుకు ఎంతో ప్రయత్నం చేసాము, కానీ అది సాధ్యపడలేదు.ఇక నాకు కూడా క్యాన్సర్ వచ్చింది అని నిర్ధారణ కాగానే 9 సార్లు కీమో థెరఫీ ని చేయించుకున్నాను, సమస్య నుండి బయటపడ్డాను అని ఆనందించే లోపే నా మరో రొమ్ముకు కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు 70 శాతం కి పైగానే ఉన్నాయి అనడం తో మళ్ళీ 7 సార్లు కీమో థెరఫీ చేయించుకున్నాను..

స్క్రీన్ మీద మళ్ళీ కనిపించాలనే నా కొరికే ఈ రోజు నన్ను క్యాన్సర్ నుండి బయటపడేలా చేసింది.అయితే ఇలాంటి సవాళ్లు ఎదురుకుంటున్న సమయం లో సరైన డాక్టర్లు లేకపోతే ఏమి చేయలేము.కానీ నాకు వ్యక్తిగతం గా ఒక డాక్టర్ ఉన్నాడు.అతను ఎప్పటికప్పుడు నా ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ద చూపిస్తూ నన్ను తన సొంతమనిషి లాగ చూసుకొని కాపాడాడు.అతని వల్లే నేను ఈరోజు ఈ మహమ్మారి తో పోరాడి జయించగలిగాను’ అంటూ ఈ సందర్భంగా హంసా నందిని చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.