Amala Paul : తన ఫేవరెట్ సాంగ్ కు స్టెప్పులేస్తూ చిల్ అవుతున్న వీడియో వైరల్

- Advertisement -

Amala Paul గుర్తుంది కదా మీకు. అదేనండి రఘువరన్ బీటెక్ సినిమాలో నాకు కార్తీక్ కంటే రఘువరన్ అంటేనే ఇష్టమంటూ హీరోకు ఇన్ డైరెక్ట్ గా సిగ్నల్ ఇస్తుంది. తనే ఈ సినిమాతో టాలీవుడ్ కుర్రాళ్ల మనసు దోచేసింది అమలా పాల్. అంతకుముందు కొన్ని సినిమాల్లో నటించినా.. తెలుగు కుర్రాళ్ల దృష్టిలో పడింది మాత్రం ఈ సినిమాతోనే. అదిరిపోయే అందంతో.. ఆకట్టుకునే నటనతో ఈ బ్యూటీ అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్, మరోవైపు మాలీవుడ్ లలో సందడి చేస్తోంది.

Amala Paul
Amala Paul

ఒకప్పుడు సగటు హీరోయిన్ పాత్రలకు, గ్లామర్ రోల్స్ కు మాత్రమే పరిమితమైన అమలా పాల్ ఆ గుర్తింపును చెరిపేస్తూ హీరోలకు తాను ఏవిధంగా తీసిపోనంటూ వైవిధ్యమైన పాత్రల్లో తన సత్తా చాటుతోంది. మరోవైపు బోల్డ్ సీన్లలో నటించడానికి ఏమాత్రం మొహమాట పడనని చెప్పేస్తోంది. పాత్ర డిమాండ్ చేస్తే న్యూడ్ గానూ నటించేందుకు రెడీ అని ఆమె అనే సినిమాతో ప్రూవ్ చేసింది అమలా పాల్.

ఓవైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్న అమలా పాల్ సోషల్ మీడియాలోనూ తన హవా సాగిస్తోంది. బోల్డ్ ఫొటోషూట్స్ తో.. క్రేజీ ఔట్ ఫిట్స్ తో.. ఎక్స్ పోజింగ్ లో హద్దులు చెరిపేస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. ఇక ఈ బ్యూటీ తన ఫొటోషూట్లలో ఇచ్చే పోజులతో ఇంటర్నెట్ లో హీట్ పుట్టిస్తోంది. తాజాగా అమలా పాల్ తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్టు చేసిన ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది.

- Advertisement -

అమలా పాల్ తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ క్రేజీ వీడియో పోస్టు చేసింది. తన ఫేవరెట్ సాంగ్ అంటూ గౌతమ్ మీనన్ తెరకెక్కించిన వెంకటేశ్, ఆసిన్ కలిసి నటించిన ఘర్షణ(తమిళ్ వెర్షన్) సినిమాలోని నన్నే నన్నే చూస్తూ అనే పాటకు స్టెప్పులేసింది. టీనేజ్ నుంచి ఇది తన ఫేవరెట్ సాంగ్ అని చెప్పుకొచ్చింది ఈ భామ. ఇప్పటికీ తన ఫేవరెట్ పాటల్లో ఈ సాంగ్ ది స్పెషల్ స్థానమని పోస్టులో రాసుకొచ్చింది.

బ్యాక్ లెస్ క్రాప్ టాప్ లో.. డెనిమ్ షాట్స్ లో జుట్టు విరబోసుకుని అమలా పాల్ ఈ పాటకు స్టెప్పులేసింది. గదిలో ఒక్కతే ఉండటంతో మైమరిచిపోయి డ్యాన్స్ చేసింది. అమలా పాల్ డ్యాన్స్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ బ్యూటీ డ్యాన్స్ లో ఓ మత్తు ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. 

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here