Guess The Actress : ఈ ఫొటో లో కనిపిస్తున్న చిన్నారి టాలీవుడ్ టాప్ హీరోల లక్కీ హీరోయిన్.. లేడీ ఓరియంట్ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్.. ఎవరో గుర్తుపట్టారా?

- Advertisement -

Guess The Actress : ఈ ఫొటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తు పట్టారా?, అందం తో పాటుగా అద్భుతమైన అభినయం కూడా ఇవ్వగల అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ఒకరు ఆమె. అంత కాదు పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటించి, వాళ్ళను తిరుగులేని స్టార్స్ గా మలిచిన హీరోయిన్ ఆమె.

Guess The Actress
Guess The Actress

సౌత్ ఇండియా లోనే లెక్కలేనంత డిమాండ్ ఉన్నా కూడా, కేవలం నటనకి ప్రాధాన్యత ఉన్న సినిమాలే చేస్తూ, అందాల ఆరబోతకు వ్యతిరేకంగా నిల్చి ఇప్పటికీ పాన్ ఇండియా లెవెల్ లో నటిగా కొనసాగుతూనే ఉంది. ఆమె మరెవరో కాదు, భూమిక చావ్లా.2000 సంవత్సరం లో సుమంత్ హీరో గా నటించిన యువకుడు అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయమైనా భూమిక ఆ సినిమా హిట్ కాకపోయినా కూడా నటిగా మంచి మార్కులను కొట్టేసింది.

Bhoomika

ఆ తర్వాత తమిళం లో విజయ్ హీరో గా నటించిన ‘బద్రి’ అనే చిత్రం లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాలో తెలుగు లో సూపర్ హిట్ గా నిల్చిన పవన్ కళ్యాణ్ ‘తమ్ముడు’ చిత్రానికి రీమేక్. ఇక ఆ తర్వాత 2001 వ సంవత్సరం లో పవన్ కళ్యాణ్ తో ‘ఖుషి’ అనే చిత్రం లో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా అప్పట్లో ఎంత పెద్ద సెన్సేషన్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

- Advertisement -
BHoomika chawla

ఈ చిత్రం తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు, ఆ తర్వాత మహేష్ బాబు తో ‘ఒక్కడు’, ఎన్టీఆర్ తో ‘సింహాద్రి’ వంటి సినిమాలు చేసింది. ఈ ముగ్గురు హీరోలు ఈ చిత్రాల తర్వాతనే సూపర్ స్టార్స్ రేంజ్ కి వెళ్లారు. ఇక ఆ తర్వాత ఆమె ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించగా , లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా సూపర్ హిట్ ని అందుకొని, సంచలనం సృష్టించింది. రీసెంట్ గా ఆమె సల్మాన్ ఖాన్ హీరో గా నటించిన ‘కేసీ కా భాయ్..కేసీ కా జాన్’ చిత్రం లో వెంకటేష్ కి జోడిగా నటించింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here