షూటింగ్ స్పాట్ లో స్టార్ హీరో గూబ పగులగొట్టిన చిరంజీవి..ధర్నా కి దిగిన ఫ్యాన్స్.. అసలు ఏమి జరిగిందంటే!

- Advertisement -

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి ని ప్రతీ ఒక్కరు గౌరవిస్తారు, తన తోటి హీరోలతో మెగాస్టార్ ఎంతో స్నేహ పూర్వకంగా మెలుగుతూ ఉంటాడు. ఏదైనా సినిమా సక్సెస్ అయితే తన తరుపున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియచేసే ఉదార స్వభావం ఉన్న వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. అందరూ ఆయనని అన్నయ్య అని ప్రేమగా పిలుస్తూ ఉంటారు.

చిరంజీవి
చిరంజీవి

ఇండస్ట్రీ లో ఎంతో గౌరవప్రదమైన స్థానం లో ఉండే మెగాస్టార్ చిరంజీవి, ప్రతీ ఒక్కరిని తన సోదరుడిగా భావించే ఆయన,తన తోటి హీరో ని చెంప పగలగొట్టారు అంటే ఎవరైనా నమ్ముతారా?, కానీ నమ్మాలి అది నిజం కాబట్టి. ఇక అసలు విషయం లోకి మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ హీరో శ్రీకాంత్ తో కలిసి శంకర్ దాదా MBBS మరియు శంకర్ దాదా జిందాబాద్ చిత్రం లో నటించిన సంగతి తెలిసిందే. ఇందులో శంకర్ దాదా జిందాబాద్ పెద్ద ఫ్లాప్ అయ్యింది.

Chiranjeevi

ఈ చిత్రం లో ఇంటర్వెల్ కి ముందు చిరంజీవి శ్రీకాంత్ మీద చెయ్యి చేసుకునే సన్నివేశం ఒకటి ఉంటుంది. అది చాలా ఎమోషనల్ గా ఉంటుంది, సినిమాకి హైలైట్ సన్నివేశం అనే చెప్పాలి. అయితే ఈ సన్నివేశం అలా పండడానికి చాలా న్యాచురల్ గా ఉండాలని శ్రీకాంత్ యే స్వయంగా చిరంజీవి ని నిజంగా కొట్టమని అన్నాడట. చిరంజీవి ముందుగా ఒప్పుకోలేదు, కానీ శ్రీకాంత్ ఆ ఫీలింగ్ రావట్లేదు దయచేసి కొట్టండి అన్నయ్య అని అడిగి మరీ కొట్టించుకున్నాడట.

- Advertisement -
CHiranjeevi srikanth

అలా శ్రీకాంత్ ని చిరంజీవి కొట్టడం, శ్రీకాంత్ ఏడవడం ఇవన్నీ యాక్టింగ్ కాదు, సహజం గానే జరిగిపోయిందట. అందుకే ఆ సన్నివేశం గురించి అప్పట్లో అందరూ అంతలా మాట్లాడుకున్నారు. అంతే కాదు సినిమాలో తమ హీరో ని కొట్టినందుకు శ్రీకాంత్ ఫ్యాన్స్ హైదరాబాద్ లో చిరంజీవికి వ్యతిరేకంగా ధర్నా కూడా చేశారట. ఈ షాకింగ్ నిజాలు తెలుసుకొని ఆశ్చర్యపోతున్నారు మెగా ఫ్యాన్స్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here