Guess The Actress : ‘ప్రేమ కథా చిత్రమ్’ హీరోయిన్ ఇప్పుడు ఎలా తయారు అయ్యిందేంటి..!ఇప్పుడు ఆమె ఏమి చేస్తుందో తెలుసా?

- Advertisement -

Guess The Actress : తొలి సినిమాతోనే అందం మరియు అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్లు ఇండస్ట్రీ లోకి రావడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది.ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలు, ఓవర్ నైట్ పాపులారిటీ ని సంపాదించడం చాలా కష్టం.అలాంటి కష్టతరమైన పరిస్థితులు ఉన్నా కూడా ‘ప్రేమ కథా చిత్రమ్’ తో నందిత రాజ్ యూత్ లో మంచి క్రేజ్ సంపాదించింది.ఈ సినిమా లో ఆమె తన అందం తో పాటుగా అద్భుతమైన అభినయం తో ఆడియన్స్ ని బయపెట్టేసింది.

Guess The Actress
Guess The Actress

ఇలా అందం మరియు అభినయం రెండూ ఉన్న హీరోయిన్ ఇండస్ట్రీ కి వచ్చి సక్సెస్ సాధించినందుకు అందరూ ఎంతో సంతోషపడ్డారు.ఈమె భవిష్యత్తులో పెద్ద స్టార్ హీరోయిన్ అవుతుందని అనుకున్నారు, కానీ ఇప్పుడు ఈమె పరిస్థితి చూస్తే జాలి వెయ్యక తప్పదు.చేతిలో ఒక్క సినిమా కూడా లేక ఎంతో ఇబ్బంది పడుతుంది.ప్రముఖ దర్శకుడు తేజ తెరకెక్కించిన ‘నీకు నాకు డ్యాష్ డ్యాష్’ అనే సినిమా ద్వారా హీరోయిన్ గా వెండితెర అరంగేట్రం చేసింది.

Nandhitha

ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది కానీ, ఆ తర్వాత వచ్చిన ‘ప్రేమ కథా చిత్రమ్’ ఈమె కెరీర్ ని మలుపు తిప్పింది.ఈ సినిమా తర్వాత ఆమెకి వరుసగా లవర్స్, రామ్ లీల, కృష్ణమ్మా కలిపింది ఇద్దరినీ,శంకరాభరణం, సావిత్రి వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కింది.వీటిల్లో కేవలం లవర్స్ అనే సినిమా తప్ప మిగిలినవి బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇక ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరో గా నటించిన ‘జై లవ కుశ’ అనే సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషించింది.

- Advertisement -
Nandhitha Photos

ఈ చిత్రం తో అయినా ఆమె తలరాత మారుతుంది అనుకున్నారు కానీ, ఆమెకి పెద్దగా పేరు తెచ్చిపెట్టలేదు.ఇక ఈమె చివరిసారిగా వెండితెర మీద కనిపించిన చిత్రం ‘విశ్వామిత్ర’.ఈ చిత్రం తర్వాత ఆమె మళ్ళీ సినిమాల్లో కనిపించలేదు. ఈమె సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ రంగం లో పని చేస్తూ ఉండేది, ఇప్పుడు ఈమెకి అవకాశాలు రాకపోవడం తో మళ్ళీ మోడలింగ్ రంగం లో బిజీ అవ్వడానికి ప్రయత్నిస్తుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here