Honey Rose: స్లీవ్ లెస్ బ్లౌజ్ లో హనీ రోజ్ అందాల విందు

- Advertisement -

Honey Rose : ‘వీరసింహారెడ్డి’ ( Veera Simha Reddy ) సినిమాతో భారీగా అభిమానులను సొంతం చేసుకుంది కేరళ ముద్దుగుమ్మ హనీరోజ్‌ ( Honey Rose ). ఆ సినిమా తర్వాత రోజూ సోషల్‌మీడియాలో కనిపిస్తూ సందడి చేస్తూనే ఉంటోంది. షాపింగ్ మాల్‌ ప్రారంభోత్సవాల్లో, పలు కార్యక్రమాల్లో అతిథిగా పాల్గొంటూ అభిమానులను ఫిదా చేస్తోంది. ఇక ఈ అందాల రాశి ఫొటోల గురించి చెప్పే పని లేదు. అందాలు అరబోస్తూ ఫొటోలకు పోజులు ఇస్తుంటుంది.

Honey Rose
Honey Rose

తాజాగా హనీ రోజ్ శారీలో మెరిసింది. స్లీవ్ లెస్ బ్లౌజ్, బ్లూ శారీలో చాలా అందంగా కనిపించింది. హనీ తన ఎద అందాలను ఫోకస్ చేసి హాట్ పోజులు ఇచ్చింది. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే హనీ రోజ్.. రోజూ తన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలలో గ్లామరస్ పోటోలను పోస్ట్ చేస్తుంటుంది. హానీ పెట్టే ఒక్కో పోస్టుకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది. ఇక హనీ రోజ్ ఎక్కువగా మలయాళంలోనే సినిమాలు చేసింది. అక్కడ ఆమె పెద్ద స్టార్. మలయాళంతో పాటు క‌న్నడ‌, త‌మిళ‌, తెలుగు సినిమాల్లో కూడా నటిస్తుంది. అందుకే ఆమెకు సోషల్ మీడియాలో లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.

Rose

2008లో వచ్చిన ఆల‌యం సినిమాతో హనీ రోజ్ తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత ‘ఈ వ‌ర్షం సాక్షిగా’ సినిమాలో నటించారు. ఇక బాలకృష్ణ హీరోగా వచ్చిన వీరసింహారెడ్డి సినిమాలో హీరోయిన్‌గా నటించి పాపులర్ అయ్యారు. ‘వీరసింహారెడ్డి’ సినిమాలో మీనాక్షి పాత్రలో మెప్పించిన హనీరోజ్‌ తర్వాత చిత్రం కోసం ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు బాలకృష్ణ ( Balakrishna ) రానున్న సినిమాలో కూడా హనీరోజ్‌కు అవకాశం ఇచ్చారనే వార్తలు వినిపిస్తున్నాయి. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రంలో ఈ అమ్మడికి అవకాశం ఇచ్చినట్లు టాక్‌ నడుస్తోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here