క్రింద కనిపిస్తున్న ఈ ఫోటో ఇంత క్యూట్ గా కనిపిస్తున్న పాప ఎవరబ్బా ? అనే సందేహం మీలో అందరిలో రావొచ్చు.ఈమె ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న స్టార్ హీరోయిన్, ఈమెతో ప్రభాస్ ఎఫైర్ కూడా నడుపుతున్నాడు అంటూ గత కొంతకాలం నుండి మీడియా లో ఒక రూమర్ కూడా ఉంది.

ఇది చెప్పిన తర్వాత ఎవరైనా గుర్తు పట్టేస్తారు,ఆమె మరెవరో కాదు కృతి సనన్ అని. అంతలా వ్యాప్తి చెందింది ఈ వార్త.కృతి సనన్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన 1 నేనొక్కడినే అనే తెలుగు సినిమాతోనే వెండితెర కి పరిచయం అయ్యింది. ఆ సినిమా లో ఈమె అందం మరియు నటన చూసిన తర్వాత బాలీవుడ్ ఈమె వెంట పడింది.రెండవ సినిమా నుండి ఇప్పటి వరకు ఈమె చేసిన సినిమాలన్నీ హిందీ సినిమాలే.

ఇప్పుడు ప్రభాస్ తో చేస్తున్న ‘ఆదిపురుష్’ సినిమా కూడా బాలీవుడ్ కి సంబంధించినది.ఇలా వరుసగా ఆమె హిందీ సినిమాలే చెయ్యడానికి కారణం ఏమిటి,టాలీవుడ్ లో ఆమెకి అవకాశాలు రావడం లేదా, వచ్చినా రిజెక్ట్ చేస్తుందా అనేది మాత్రం తెలియడం లేదు.సినిమాల్లోకి అడుగుపెట్టకముందు ఈమె ఒక పెద్ద మోడల్ గా కొనసాగింది.అక్కడ మంచి పేరు ప్రతిష్టలు వచ్చిన తర్వాత ఆమెకి టాలీవుడ్ లో మొదటి సినిమాతోనే ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు తో నటించే ఛాన్స్ దక్కింది.

ఆ సినిమా ఫ్లాప్ అయినా కూడా ఈమెకి నేడు ఇన్ని అవకాశాలు వచ్చాయి, ఎన్నో హిట్స్ వచ్చాయి అంటే మాటలు కాదు. మరో విశేషం ఏమిటంటే ఈమె చెల్లెలు నుపుర్ సనన్ కూడా హీరోయిన్ గా అడుగుపెట్టింది. ఈమె తెలుగు లో రవితేజ హీరో గా నటిస్తున్న ‘టైగర్ నాగేశ్వర రావు’ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తుంది. ఇది ఇలా ఉండగా కృతి సనన్ కి సంబంధించిన మరికొన్ని చిన్ననాటి ఫోటోలు ఎక్సక్లూసివ్ గా మీకోసం అందిస్తున్నాము చూడండి.


