ఓరి నాయనో ఇదేం ట్విస్ట్.. పెళ్లి కాకుండానే ఒకబిడ్డకు తల్లి అయిన త్రిష.. ఫొటోస్ వైరల్..

- Advertisement -

దక్షిణ సినీ పరిశ్రమలో వయస్సు మీద పడుతున్నా పెళ్లి చేసుకొని హీరోయిన్లలో ఒకరు త్రిష.. ఇప్పుడు త్రిషకు 40 ఏళ్లు పూర్తి అయ్యాయి.. వయస్సు పెరిగిన అందం మాత్రం అస్సలు తగ్గలేదు.. ఇప్పుడు మరింత అందంగా ఉందనే చెప్పాలి.. ఈ అమ్మడుతో పాటు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ముద్దుగుమ్మలు పెళ్లి చేసుకున్నారు.. కానీ ఈమె మాత్రం స్టార్ హీరోలతో ప్రేమాయణం నడుపుతుంది.. గతంలో రానా, ధనుష్‌, శింబు వంటి వారితో ఎఫైర్లు నడిపించిన త్రిష.. 2015 లో కోలీవుడ్‌ నిర్మాత మరియు వ్యాపారవేత్త వరుణ్ మణియన్‌తో పెళ్లి పీటలు ఎక్కాలనుకుంది. వరుణ్‌, త్రిషలకు ఇరుకుటుంబసభ్యులు ఘనంగా నిశ్చితార్థం చేసుకున్నారు.. అది మధ్యలోనే ఆగిపోయింది.. ఇక ఇప్పుడు ఓ వార్త నెట్టింట షికారు చేస్తుంది..

త్రిష
త్రిష

అదేంటంటే.. పెళ్లి కాకుండానే ఓ బిడ్డకు త్రిష తల్లి అయ్యింది.. అసలు మ్యాటర్ ఏంటో తెలుసుకుందాం.. తన ఎంగేజ్మెంట్ ఆగిపోయిన తర్వాత కేరీర్ పై ఫోకస్ పెడుతూ.. వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతుంది.. ఓవైపు హీరోలకు జోడీగా నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేసింది. కానీ, త్రిష సక్సెస్ రేటు తక్కువే అని చెప్పాలి. ఈ సంగతి పక్కన పెడితే.. పెళ్లి కాకుండానే త్రిష తల్లి అయింది. అంతేకాదు, తాజాగా తన ముద్దుల తనయుడితో దర్శనమిచ్చి ఎవరూ ఊహించని విధంగా ట్విస్ట్ ఇచ్చింది. అయితే ఖంగారు పడకండి. త్రిష తన రియల్ కొడుకును కాదు రీల్ కొడుకును అందరికీ పరిచయం చేసింది. ప్రస్తుతం త్రిష ‘ది రోడ్’ అనే తమిళ చిత్రంలో నటిస్తోంది. అరుణ్ వసీగరన్ దర్శకుడు. ఇదొక లేడీ ఓరియెంటెడ్ సినిమా…

Trisha

ఇక ఈ సినిమా సబీర్‌, సంతోష్ ప్రతాప్‌, నటి మియా జార్జ్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో త్రిష ఓ చంటి పిల్లాడికి తల్లి పాత్రలో నటిస్తోంది. తాజాగా ఆ బాబుతోనే త్రిష ఫోటోలు దిగింది. ఈ పిక్స్ ను త్రిష సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. అవి కాస్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ పిక్స్ చూసిన నెటిజన్లు నువ్వు కూడా పెళ్లి చేసుకొని ఇలాంటి అందమైన బిడ్డను కను.. పెళ్లి చేసుకో.. అంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తానికి ఈ ఫోటోలు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి.. తమిళ్ లో వరుస సినిమాలు చేస్తూ ప్రస్తుతం బిజీగా ఉంటుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here