Guess The Actress : ఈ ఫోటోలో కింద కూర్చుని బొద్దుగా ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా ?

- Advertisement -


Guess The Actress : సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత కొందరు తమ అభిమాన స్టార్ హీరో, హీరోయిన్‌ల‌.. లైఫ్ స్టైల్, చిన్ననాటి ఫోటోలను ట్రెండ్ చేస్తు్న్నారు. వారికి సంబంధించిన ఏ విషయం కాస్త తెలిసినా ప్రేక్షకులు దాన్ని ఎంతో ఆసక్తిగా గమనిస్తుంటారు. వారు పోస్ట్ చేసిన సమాచారాన్ని క్షణాల్లో వైరల్ చేస్తూ ఉంటారు. అలాగే ఓ తెలుగు హీరోయిన్ పాత ఫోటో నెటింట్లో తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుతం నాజుకు సొగ‌సుల‌తో మెరుపు తీగ‌లా మారిపోయింది. ఫిట్నెస్ ఫ్రీక్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ అమ్మడు. పాత ఫోటోలో మాత్రం గుర్తుపట్టలేకుండా చాలా బొద్దుగా అసలు గుర్తుపట్టలేని విధంగా ఉంది. ఈ ఫోటో చూసిన వారంతా అప్పటికి, ఇప్పటికీ అంత మార్పు అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఆ పై ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ?

ఆమె టాలీవుడ్ టైర్ 2 హీరోలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. తెలుగులో చాలా తక్కువ సినిమాల్లో నటించిన తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇప్పటికీ ఆమె ఎవరో గుర్తుకు రాలేదా.. సరే మేమే చెప్తాం లేండి. ఆమె అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన హలో అనే సినిమాలో హీరోయిన్ గా నటించిన కళ్యాణి ప్రియదర్శన్. తొలి సినిమాతోనే ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది. తర్వాత సాయి ధరమ్ తేజ్ చిత్రలహ‌రి సినిమాలో నటించినా ఊహించిన రేంజ్‌లో సక్సెస్ అందుకోలేకపోయింది. తర్వాత టాలీవుడ్‌లో పెద్దగా అవకాశాలైతే రాలేదు. దీంతో ఆమె సొంత ఊరికి వెళ్లిపోయింది. మలయాళంలో వరుస ఆఫర్లను అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా మారింది.

ఇప్పటివరకు ఆమె మలయాళ స్టార్ హీరోస్ అందరితోనూ నటించింది. అయితే తెలుగులో కూడా స్ట్రెయిట్ సినిమాల‌లో నటించకపోయిన ఓటీటీ డబ్బింగ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఇప్పుడు మంచి ఫిజిక్‌తో నాజుక్కుగా కనిపిస్తూ మెరుపుతీగల మెరుస్తున్న కళ్యాణి.. సినిమాల్లోకి రాకముందు చాలా లావుగా ఉండేది. అప్పటి ఫోటో, ఇప్పటి ఫోటో పక్కన పెట్టి చూస్తే అసలు పోలిక లేదు. ఇకపోతే కళ్యాణి తల్లిదండ్రులు ఇద్దరూ సినీ ఇండస్ట్రీకి చెందిన వారే కావడం విశేషం. తండ్రి ప్రియదర్శన్‌.. ప్రముఖ డైరెక్టర్ కాగా, తల్లి లీజి ఒకప్పటి హీరోయిన్. తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాలో నటించింది. కళ్యాణి కూడా తల్లిదండ్రుల అడుగుజాడలోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కెరీర్ లో బిజీగా ఉంటోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here