Actress Anupama : ఛాన్స్ అసలు మిస్ చేసుకోవద్దు.. ఆ గిఫ్ట్ ఇచ్చినోళ్లకు హీరోయిన్ అనుపమ సొంతమట

- Advertisement -


Actress Anupama : హీరోయిన్ అనుపమ పరేశ్వరన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వాస్తవానికి కేరళ కుట్టి అయినప్పటికీ తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ మొదట్లో చాలా పద్ధతిగా పక్కింటి అమ్మాయిలా అనిపించింది. పలు హిట్ చిత్రాల్లో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డతో టిల్లు స్వ్కేర్‌ చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమాలో అనుపమ ఎన్నడూ లేని విధంగా బోల్డ్, రోమాంటిక్ సీన్స్‌తో ఓ రేంజ్ లో రెచ్చిపోయింది. ఇటీవల విడుదలైన టీజర్‌లో అనుపమ, సిద్ధు మధ్య ఉన్న సన్నివేశాలు అందరినీ ఆకట్టుకున్నాయి. తన కెరీర్ లో ఇప్పటివరకు ఎన్నడూ హద్దు మీరి నటించలేదు అనుపమ. అలాంటి అనుపమ ఈ సినిమాలో ముద్దు సీన్స్ తో షాక్ ఇచ్చింది. అలాంటి సీన్స్‌లో ఆమెను ఊహించుకోలేమంటూ అనుపమ అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఆవేదన కూడా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

అయితే ఈ కేరళ కుట్టికి షూటింగ్ గ్యాప్ కాస్త దొరకితే వెకేషన్స్‌కు వెళ్లి ఎంజాయ్ చేస్తుంది. అంతేకాకుండా ఆ ఫొటోలు, వీడియోలను నెట్టింట షేర్ చేసి రచ్చ చేస్తుంది. తాజాగా, అనుపమ ఓ ఆసక్తికర పోస్ట్ షేర్ చేసింది. తనకు ఓ జంతువును గిఫ్ట్‌గా ఇచ్చి తనను సొంతం చేసుకోమంటూ అబ్బాయిలకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ‘‘ దీనిని నాకు గిఫ్ట్‌గా తీసుకురండి బాయ్స్. నేను మీ సొంతం’’ అంటూ రాసుకొచ్చింది. అసలు విషయం ఏంటంటే.. నీటి ఏనుగుగా చెప్పబడే హిప్పోపొటామస్ పిల్ల వీడియోను షేర్ చేసింది. దీంతో అది చూసిన నెటిజన్లు పదండి బాయ్స్ అలర్ట్ అవ్వండి. హిప్పోని గిఫ్ట్‌గా ఇచ్చి అనుపమను సొంతం చేసుకుందాం అంటూ ఫన్నీ మీమ్స్ షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేసిన పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here