Hari Hara Veera Mallu : పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. వీరమల్లు కోసం మరో యంగ్ హీరో ఎంట్రీ..

- Advertisement -

Hari Hara Veera Mallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు..ఈయన నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే..ఈ సినిమాను దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండగా, పూర్తి ఫిక్షన్ కథతో ఈ సినిమా రానుంది. ఇక ఈ సినిమాలో పవన్ సరికొత్త లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమా పై భారీ అంచనాలు పెరగడంతో పాటు ఎప్పుడెప్పుడు సినిమాను చూద్దామా అని ఆయన ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూన్నారు..

Hari Hara Veera Mallu
Hari Hara Veera Mallu

ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్ ఉండటంతో ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో బాబీ డియోల్, బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, ఇప్పుడు మరో యంగ్ హీరో కూడా ఈ సినిమాలో జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో వీరమల్లు అనుచరుడి పాత్ర సినిమాలో చాలా కీలకంగా ఉండబోతుందని.. ఈ పాత్ర కోసం ఓ యంగ్ హీరోను తీసుకునేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోందట..

అయితే పవన్ కు సెట్ అయ్యే యంగ్ హీరో ఎవరా అని జనాలు జుట్టు పీక్కుంటున్నారు.. తెరమీద యంగ్ హీరో విజయ్ దేవరకొండ పేరు ఎక్కువగా వినిపిస్తుంది.. ఈ పాత్ర కోసం ఎవరిని హీరోగా తీసుకుంటారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాలో అందాల భామ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఏఎం. రత్నం ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి ఈ సినిమాలో మరో హీరోగా ఎవరు నటిస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.. ఈరోజు అనౌన్స్ చేయనున్నారని సమాచారం… చూద్దాం డైరెక్టర్ ఎవరిని సెట్ చేస్తాడో..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here