Genelia: చీరకట్టులో హహహ హాసిని.. క్యూట్ స్మైల్ తో మెస్మరైజ్ చేస్తున్న బ్యూటీ

- Advertisement -

Genelia: హాహాహా హాసిని అంటూ తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసింది జెనీలియా. ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ చాలా పాపులర్. ఎప్పుడూ హ్యాపీగా కనిపించే జెనీలియా అంటే సినీ సెలబ్రిటీలకు కూడా చాలా ఇష్టం. సోషల్ మీడియాలో జెనీలియా తాజాగా కొన్ని ఫొటోలు పోస్టు చేసింది. చాక్లెట్ కలర్ శారీలో మరాఠీ సంప్రదాయ బొట్టుతో జెనీలియా సందడి చేసింది.

Genelia
Genelia

ఈ ట్రెడిషనల్ డ్రెస్సులో ఈ భామ తన క్యూట్ స్మైల్​తో అభిమానుల మనసు దోచేసింది. ఈ స్మైల్​ కోసం తెలుగు తెర ఎన్నో ఏళ్ల నుంచి వేచి చూస్తోందంటూ తెలుగు కుర్రాళ్లు కామెంట్లు పెడుతున్నారు. హాసిని టాలీవుడ్​కు కమ్​బ్యాక్ ఇచ్చేయ్ అంటూ తెగ రిక్వెస్టులు పెడుతున్నారు. ఇంతకీ ఓ విషయం చెప్పడం మర్చిపోయా.. ఈ కుర్రాళ్ల రిక్వెస్టు జెనీలియాను చేరినట్టుంది. ఈ భామ ఇటీవల ఓ తెలుగు సినిమాకు సంతకం చేసింది. అయితే హీరోయిన్​గా మాత్రం కాదు. హీరోకు సోదరిగా. ఏదేమైనా తెలుగు తెరపై జెనీలియాను మరోసారి చూడబోతున్నామన్నమాట. 

hasini

ఈ బ్యూటీ బాయ్స్ సినిమాతో అరంగేట్రం చేసి ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది. ఎన్టీఆర్, రామ్, రానా వంటి యంగ్ హీరోలతో జతకట్టింది. బొమ్మరిల్లు సినిమాలో హాసిని పాత్రతో తెలుగు కుర్రాళ్ల మదిని దోచేసింది. తమకు కూడా హాసిని లాంటి గర్ల్​ఫ్రెండ్ కావాలని అనుకోని కుర్రాడు ఉండడంటే నమ్మశక్యం కాదు. అంతలా ఆ పాత్రలో జెనీలియా ప్రేక్షుకలను అలరించింది. ఈ సినిమా తర్వాత ఈ భామ టాలీవుడ్​లో సూపర్ హిట్ మూవీస్​లో నటించి అనతి కాలంలోనే స్టార్​డమ్ సంపాదించుకుంది. ఆ తర్వాత బాలీవుడ్​కు వెళ్లిపోయింది.

- Advertisement -
deshmukh

అక్కడ తన కోస్టార్ రితేశ్ దేశ్​ముఖ్​తో ప్రేమలో పడింది. కొన్నేళ్లపాటు డేటింగ్ చేసిన ఈ జంట ఓ శుభముహూర్తాన వివాహ బంధంతో ఒక్కటైయింది. పెళ్లి.. వెనువెంటనే ఇద్దరు పిల్లలు. ఇక ఫ్యామిలీ లైఫ్​తో క్షణం తీరికలేకుండా పోవడంతో జెనీలియా సినిమాలకు బైబై చెప్పేసి తన ఫోకస్ అంతా ఫ్యామిలీపైనే పెట్టింది. అప్పట్నుంచి ఇటు తెలుగు తెరకు.. అటు బాలీవుడ్​ స్క్రీన్​కు దూరమైపోయింది. ఇప్పుడు పిల్లలు కాస్త పెరిగి పెద్దయ్యారు. వాళ్లు స్కూల్​కు వెళ్తున్నారు. అందుకే ఈ బ్యూటీ నెమ్మదిగా వెండితెరపైకి కమ్​బ్యాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది.

ఇందులో భాగంగానే జెనీలియా బాలీవుడ్​లో పలు షోలకు జడ్జిగా వ్యవహరించింది. ముఖ్యంగా డిజిటల్ మీడియాలో ఓ క్రేజీ షోకు తన భర్త రితేశ్ దేశ్​ముఖ్​తో కలిసి హోస్టుగా వ్యవహరించింది. అలా నెమ్మదిగా ఎంటర్​టైన్మెంట్ ఫీల్డ్​లోకి కమ్​బ్యాక్ ఇచ్చిన జెనీలియా ఇటీవల మజిలీ మరాఠీ రీమేక్ వేడ్ సినిమాలో తన భర్తతో కలిసి నటించింది. ఈ సినిమా మరాఠీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అక్కడి ప్రేక్షకులు రితేశ్, జెనీలియా జంటల కెమిస్ట్రీకి ఫిదా అయ్యారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here