Gattamaneni Sitara : ఇంస్టాగ్రామ్ లో మహేష్ బాబు కూతురు ‘సితార’ నెల సంపాదన తో సినిమా తీసేయొచ్చు తెలుసా..!

- Advertisement -

Gattamaneni Sitara : టాప్ సెలబ్రిటీస్ సినిమాల్లో/సీరియల్స్ మొదటి వ్యాపకం అయితే, రెండవ వ్యాపకం గా ఇప్పుడు ఇంస్టాగ్రామ్ మారిపోయింది. సినిమాల్లో వచ్చే డబ్బులకంటే ఇంస్టాగ్రామ్ ద్వారా సంపాదించే డబ్బులు ఎక్కువ ఉంటాయంటే ఏమాత్రం అతిసయోక్తి లేదు. ముఖ్యంగా హీరోయిన్స్ కి అయితే చెప్పనవసరం లేదు. వాళ్లకు ఉన్నత రీచ్ మరియు ఫాలోయర్స్ స్టార్ హీరోలకు కూడా ఉండరు. ఎందుకంటే వాళ్ళు అన్నీ భాషల్లో నటించి ఉంటారు కాబట్టి అందరికీ సుపరిచితమే.

Gattamaneni Sitara
Gattamaneni Sitara

అందుకే వాళ్ళు ఏ పోస్ట్ పెట్టినా నిమిషాల వ్యవధిలోనే లక్షల కొద్దీ లైక్స్ మరియు కామెంట్స్ వస్తుంటాయి. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకపోయినా కూడా, కేవలం ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా లక్షల రూపాయిలు సంపాదించే సెలబ్రిటీస్ కొంతమంది ఉన్నారు. వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఒకరు. ఈమె చిన్నతనం నుండే ఇంస్టాగ్రామ్ మరియు యూట్యూబ్ లలో అకౌంట్స్ ని క్రియేట్ చేసుకొని తనకి తోచిన కంటెంట్ ని ఇస్తూ ఉంటుంది.

Gattamaneni Sitara Mahesh babu

ఇంస్టాగ్రామ్ లో ఈమె తరచూ అప్లోడ్ చేసే క్యూట్ ఫోటోలు మరియు రీల్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోతుంటారు. డ్యాన్స్ కూడా ఈ అమ్మాయి అదరగొట్టేస్తుంది. ఇక ఈమెకి ఉన్న యూట్యూబ్ ఛానల్ కూడా బాగా పాపులర్ అయ్యింది. కేవలం ఇంస్టాగ్రామ్ ద్వారా సితార కి నెలకి 30 లక్షల రూపాయిల డబ్బులు వస్తాయట. ఇది సాధారణమైన నెంబర్ కాదు. కొంతమంది స్టార్ హీరోయిన్స్ కి కూడా ఆ రేంజ్ డబ్బులు రావు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. కేవలం ఈమెకి మహేష్ బాబు కూతురు అవ్వడం వల్ల అంత ఫేమస్ అవ్వలేదు.

- Advertisement -

తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కుని ఏర్పాటు చేసేలా ఆమె కంటెంట్ ఉంటుంది. అందుకే సితార కి సోషల్ మీడియా లో ఆ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక యూట్యూబ్ ద్వారా కూడా ఈమెకి నెలకి 30 నుండి 40 లక్షల రూపాయిల లాభాలు వస్తున్నాయట. ఇంత డబ్బులతో ఒక్క చిన్న సినిమానే తీసేయొచ్చు అని అంటున్నారు ఫ్యాన్స్. ఈ వయస్సులోనే ఈ రేంజ్ లో ఉంటే, ఇక పెద్దయ్యాక సితార ఏ రేంజ్ కి వెళ్తుందో అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here