Trivikram Srinivas : పాపం త్రివిక్రమ్ కి ఇక వాళ్ళే దిక్కు.. ఒక్క ఫ్లాప్ తో తలక్రిందలైన త్రివిక్రమ్ కెరీర్!

- Advertisement -

Trivikram Srinivas : టాలీవుడ్ టాప్ 3 డైరెక్టర్స్ లిస్ట్ ఒకసారి తీస్తే అందులో త్రివిక్రమ్ శ్రీనివాస్ ముందు వరుసలో ఉంటాడు. ఒక సాధారణ స్క్రీన్ ప్లే రైటర్ గా కెరీర్ ని ప్రారంభించిన ఆయన ఆ తర్వాత డైరెక్టర్ గా మారి ఎన్నో క్లాసిక్ హిట్స్ ని టాలీవుడ్ కి అందించాడు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇలా ప్రతీ ఒక్కరికి మరపురాని హిట్లు ఇచ్చాడు.

Trivikram Srinivas
Trivikram Srinivas

కానీ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లకు మంచి సినిమాలు ఇచ్చాడు. అలాగే ఫ్యాన్స్ పీడకల లాగ భావించే సినిమాలు కూడా ఇచ్చాడు. రీసెంట్ గా మహేష్ బాబు తో తీసిన ‘గుంటూరు కారం’ చిత్రం చూస్తే త్రివిక్రమ్ పని ఇక అయిపోయింది అనే విషయం అర్థం అవుతుంది. అంత చెత్తగా ఆ సినిమాని తీసాడు. మహేష్ కి ఉన్న స్టార్ స్టేటస్ కారణంగా ఆ సినిమా కనీసం సంక్రాంతి పండుగ సెలవుల్లో అయినా ఆడింది కానీ, లేకుంటే ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలేది.

Trivikram Srinivas Updates

‘గుంటూరు కారం’ చిత్రం తర్వాత ఇప్పుడు మహేష్ బాబు తో సినిమాలు చెయ్యాలంటే భయపడిపోతున్నారు స్టార్ హీరోలు. ఈ సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడే అల్లు అర్జున్ తో ఒక సినిమా ఫిక్స్ చేసాడు. కానీ ఆ సినిమా ఇప్పుడు సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయని టాక్. ఒకప్పుడు రవితేజ, రామ్ , వెంకటేష్, నాని వంటి హీరోల వైపు కన్నెత్తి కూడా చూసేవాడు కాదు త్రివిక్రమ్.

- Advertisement -

కానీ ఇప్పుడు ఆయనకీ వాళ్ళు మాత్రమే దిక్కు అయ్యారు. వీళ్ళతో కూడా త్రివిక్రమ్ ఫ్లాప్స్ తీస్తే ఇక ఆయన పవన్ కళ్యాణ్ కి మ్యానేజర్ గా స్థిరపడిపోవచ్చు , లేదా నిర్మాతగా సెటిల్ అవ్వొచ్చు అని అంటున్నారు. ఇప్పటికే ఆయనకీ ఫార్చూన్ ఫోర్ పేరు తో ఒక నిర్మాణ సంస్థ ఉంది. ఈ సంస్థ పై ఆయన పలు చిన్న సినిమాలను నిర్మించాడు కానీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here