Vishwak Sen : గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ డేట్ ఫిక్స్..! ఎప్పుడంటే..

- Advertisement -

Vishwak Sen : మాస్ కాదాస్ విశ్వక్ సేన్ మంచి జోరు మీదున్నాడు. గామి సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మార్చి 8న విడుదలైన ఈ చిత్రం తొలిరోజు బ్రేక్ ఈవెన్‌ను దాటుతుంది. కేవలం ఆరు కోట్లతో రూపొందిన ఈ సినిమా.. రూ. 30 కోట్లకు పైగా వసూలు చేసింది. విశ్వక్ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. చాందిని చౌదరి కథానాయికగా నటించగా.. అభినయ కీలక పాత్రలో నటించింది. విద్యాధర్ కహ్యా దర్శకత్వం వహించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఉండగా.. విశ్వక్ మరో సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అదే నండి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ డేట్ ఎట్టకేలకు ఫిక్స్ అయింది. ఛల్ మోహన్ రంగ ఫేమ్ కృష్ణ చైతన్య దర్శకత్వం వ‌హించారు. గామి కంటే ముందే విడుదల కావాల్సిన ఈ సినిమా.. వాయిదా పడుతూ.. ఎట్ట‌కేల‌కు థియేటర్లలోకి రాబోతోంది. ఈ చిత్రాన్ని మే 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు తెలియజేస్తూ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. సుట్టంలా సూసి పోకలా సాంగ్ ఓ రేంజ్ లో ఇప్ప‌టి దూసుకుపోతున్న విష‌యం తెలిసిందే.

విశ్వక్ సేన్ 11వ సినిమా గతేడాది విడుదల కావాల్సి ఉంది. చిత్ర యూనిట్ కూడా అక్కడి నుంచి మార్చి 8ని ప్రకటించింది. అనుకోని కారణాల వల్ల సినిమా వాయిదా పడింది. గోదావరి నేపథ్యంలో సాగే పొలిటికల్‌ విలేజ్‌ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చారు. అమిత్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, నవీన్ నూలి ఎడిటింగ్‌ను నిర్వహిస్తున్నారు. డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి కథానాయికగా నటిస్తోంది. అంజలి కీలక పాత్ర పోషిస్తోంది. మహిళా దినోత్సవం సందర్భంగా అంజలి పిక్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇందులో ఆమె వేశ్య పాత్రలో కనిపించనుందని సమాచారం. గత కొంత కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఎట్టకేలకు వేసవిలో సందడి చేయనుంది. నాజర్, సాయికుమార్, హైపర్ ఆది కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here