విడుదలకు ముందే కేసుల గోలలో రామ్ చరణ్ సినిమా.. కారణమిదే

- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌, స్టార్ డైరెక్టర్ శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ ‘గేమ్‌ ఛేంజర్‌’. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాని సెట్స్ మీదకు వెళ్లినప్పటి నుంచి ఏదొక కంటెంట్ లీక్ అవుతుండటం మేకర్స్ కు పెద్ద తలనొప్పిగా మారింది. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ ఆడియో సాంగ్ లీకైంది.

దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రొడ్యూసర్, లీకు రాయుళ్ళపై పోలీసులకు ఫిర్యాదు చేసారు. ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమా నుంచి ‘జరగండి జరగండి’ అంటూ సాగే పాట ఆన్ లైన్ వేదికగా లీకైంది. ఏదో ఒకటీ రెండు లైన్స్ కాకుండా ఏకంగా ఫుల్ సాంగ్ నే లీక్ చేసారు. ఇది కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో యూనిట్ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను సంప్రదించి, ఈ పాటను లీక్‌ చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ లో వెల్లడించారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ సంస్థ ట్వీట్ చేస్తూ..

”మా ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమాలోని కంటెంట్ ను లీక్ చేసిన వ్యక్తులపై IPC సెక్షన్ 66(C) కింద క్రిమినల్ కేసు నమోదు చేయబడింది. చట్టవిరుద్ధంగా లీక్ చేయబడిన నాణ్యతలేని ఆ కంటెంట్‌ను షేర్ చేయవద్దని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము” అని పేర్కొన్నారు. దీనికి పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన కంప్లెయింట్ కాపీని జత చేసారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ‘జరగండి జరగండి’ బేసిక్ వెర్షన్ సాంగ్ ని లీక్ చేసిన వారిపై యాక్షన్ తీసుకోవాలని అందులో పేర్కొన్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here