Faria Abdullah : బాబోయ్..నిషా కళ్ళతో మత్తెక్కిస్తున్న ఫరియా అబ్దుల్లా హాట్ పిక్స్‌..

- Advertisement -

Faria Abdullah : జాతి రత్నాలు ఫెమ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా గురించి అందరికి తెలుసు..మొదటి సినిమాతోనే హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకుంది.. అందం, అభినయంతో యువతను కట్టి పడేసింది..ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ఒక్కసారిగా ఈ హైదరాబాదీ అమ్మాయి పాపులారిటీ పెరిగింది.. అయితే ఈ అమ్మడుకు ఫాలోయింగ్ కూడా ఎక్కువే..సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ యువతకు పిచ్చెక్కిస్తుంది… తాజాగా మరో కొన్ని ఫోటోలను షేర్ చేసింది ఇప్పుడు అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి..

Faria Abdullah
Faria Abdullah

గ్లామర్ తోనే కాకుండా.. కామెడీ టైమింగ్ తో కూడా ఆకట్టుకుంది ఫరియా అబ్దుల్లా. మొదటి సినిమాతోనే ప్రభాస్ లాంటి అగ్ర స్టార్ హిరో ప్రశంసలు అందుకోవడంతో ఇక ఈ బ్యూటీ తిరుగేలేదని అనుకున్నారంతా. కానీ ఊహించిన దానికి భిన్నంగా ఆమె కెరీర్ సాగిపోతోంది..మొదటి సినిమా అయితే హిట్ అయ్యింది కానీ..ఫరియాకి ఆశించిన అవకాశాలు దక్కలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో మాస్ రాజా రవితేజ సినిమా మాత్రమే ఉంది. అది కూడా నలుగురు హీరోయిన్స్లో ఒకరిగా ఆమె నటిస్తోంది.

Actress Faria Abdullah Photos
Actress Faria Abdullah Photos

హీరోయిన్ కన్నా కూడా ఐటమ్ గర్ల్ గా పాపులర్ అవుతుంది.వరుస అవకాశాలతో దూసుకుపోతోంది.. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో నాగార్జున , నాగ చైతన్య హీరోలుగా నటించిన ‘బంగార్రాజు’ సినిమాలో ఐటెం సాంగ్ చేసి అందరికీ ఫిదా చేసింది ఈ ముద్దుగుమ్మ ఫరియా అబ్దుల్లా . ఈ సాంగ్ సూపర్ రెస్పాన్స్ అందుకుంది.అయితే ఇప్పుడు ఈ అమ్మడికి మరో ఐటెం సాంగ్ చేసే అవకాశం దక్కిందని తెలుస్తోంది.అఖిల్ హీరోగా రాబోతున్న ‘ఏజెంట్’ సినిమాలో ఐటెం సాంగ్ చేస్తోందట ఫరియా అబ్దుల్లా. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతుంది.. ఏది ఏమైనా కూడా ఈ అమ్మడు పిక్స్ మాత్రం హాట్ కేకుల్లా యువతను కట్టి పడేస్తున్నాయి..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here