Baby Movie : ట్రయాంగిల్ లవ్ స్టోరీ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బేబీని విశేషంగా ఆదరించడానికి వెనుక ఉన్న కారణం ఏమిటో మీకు తెలుసా. ప్రస్తుత కాలంలో వందలు కోట్లు ఖర్చుపెట్టి భారీ బడ్జెట్ తో తీస్తున్న చిత్రాలను కూడా కంటెంట్ కనెక్ట్ కాకపోతే నిర్మోహమాటంగా పక్కన పెట్టేస్తున్నారు ప్రేక్షకులకు. కానీ చిన్నపాటి సాదాసీదా సినిమా అయినా సరే కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటే సూపర్ హిట్ అవడం కన్ఫర్మ్ .

అందుకే గత కొద్ది కాలంగా పెద్ద పెద్ద సినిమాలు కంటే కూడా చిన్న సినిమాలే భారీ విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. డైరెక్టర్లు కూడా కంటెంట్ ను నమ్ముకొని ధైర్యంగా చిన్నచిత్రాలను తీయడానికి ముందుకు వస్తున్నారు. ఆనంద దేవరకొండ హీరోగా వచ్చిన తాజా చిత్రం బేబీ కూడా ఈ కోవకే చెందుతుంది. ఎటువంటి హడావిడి లేకుండా థియేటర్ లోకి వచ్చిన ఈ చిత్రం యువతను విపరీతంగా ఆకర్షిస్తుంది.సినిమాకి వెళ్లి వచ్చిన అందరూ ప్రతి యూత్ తప్పకుండా చూడాలి అని పోస్టర్లు పెట్టడంతో అసలు ఈ సినిమాలో అంత ఏముంది అన్న చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది.

ఎప్పుడు కూడా లవ్ స్టోరీలు బాగా క్లిక్ అవుతాయి ఎందుకంటే యువత వీటిని బాగా ఓన్ చేసుకుంటారు కాబట్టి. మంచి స్ట్రాంగ్ స్టోరీ తో వినూత్నమైన కాన్సెప్ట్ హైలైట్ చేసి లవ్ స్టోరీ తీసి ఎమోషనల్ గా కనెక్ట్ చేయగలిగితే చాలు ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది.ఇప్పటివరకు ట్రయాంగిల్ లవ్ స్టోరీ లు చాలా వచ్చినప్పటికీ బేబీ స్టోరీ మాత్రం చాలా వినూత్నంగా ఉంది.
దీన్ని తను అనుకున్న రీతిలో కరెక్ట్ గా ప్రేక్షకుల మధ్యకు తీసుకురావడంలో డైరెక్టర్ సాయి రాజేష్ తన నైపుణ్యాన్ని ప్రదర్శించి సఫలమయ్యారు. ఇందులో వైష్ణవి ఒకవైపు చైతన్య మరోవైపు అతని స్నేహితుడు తో కలిసి ఉంటూ చేసే యాక్టింగ్ ఈ కాలంలో ఉన్న చాలా మంది అమ్మాయిలు ఇంతేనా అన్న భావన కనిపిస్తుంది. కానీ మూవీ చివరికి వైష్ణవి క్యారెక్టర్ కి కూడా జస్టిఫికేషన్ ఇచ్చిన తీరు అందర్నీ ఆకర్షిస్తుంది. ఇంతకుముందు ప్రేమించే విఫలమైన వాళ్ళు ప్రస్తుతం ప్రేమిస్తున్న వాళ్ళు ఇలా ఆల్మోస్ట్ అందరికీ ఈ సినిమా కనెక్ట్ అవ్వడంతో ప్రస్తుతం ఈ మూవీ బాగా హిట్ అయింది.