Vijay Antony : చనిపోయే ముందు విజయ్ ఆంటోని కూతురు లాస్ట్ ఫోన్ కాల్ ఎవరితో మాట్లాడిందో తెలుసా ?Vijay Antony : ప్రముఖ స్టార్ హీరో విజయ్ ఆంటోని కూతురు నిన్న తెల్లవారుజామున 3 గంటలకు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఆత్మహత్యకు ముందు ఆమె ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుస్తోంది. విజయ్ ఆంటోని కుమార్తెతో చివరిగా ఎవరు మాట్లాడారని, తన ఆత్మహత్యకు గల కారణాలు ఏమిటన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బిచ్చగాడు సినిమాతో తెలుగు వారికి సుపరిచితుడు విజయ్ ఆంటోని. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. హీరోగానే కాదు… ఎన్నో చిత్రాలకు సంగీత దర్శకుడిగా కూడా పనిచేశాడు. అంతే కాదు సౌండ్ ఇంజనీర్, ఎడిటర్, ప్రొడ్యూసర్, ప్లేబ్యాక్ సింగర్ ఇలా అన్ని రంగాలలో ఆయనకు నైపుణ్యం ఉంది. ఇటీవల బిచ్చగాడు 2, హత్య చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ ఆంటోని ఇంట్లో విషాద సంఘటన చోటుచేసుకుంది.

Vijay Antony
Vijay Antony

విజయ్ ఆంటోని కూతురు ఆత్మహత్య తమిళ ఇండస్ట్రీలోనే కాకుండా తెలుగు ఇండస్ట్రీలో కలకలం రేపింది. నిన్న తెల్లవారుజామున 3 గంటలకు విజయ్ ఆంటోని కూతురు చెన్నైలోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కూతురి గదికి చేరుకున్న తండ్రి విజయ్‌ ఆంటోని ఫ్యాన్‌కు వేలాడుతూ ఉండడం చూసి చలించిపోయాడు. వెంటనే సిబ్బంది సహాయంతో సమీపంలోని కావేరి ఆస్పత్రికి తరలించారు. అక్కడ మీరాను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. విజయ్ ఆంటోని కూతురు డిప్రెషన్‌తో బాధపడుతోందని… ఇందుకోసం గత కొన్ని రోజులుగా మందులు వాడుతున్నట్లు తేనంపేట పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో తేలింది. చర్చ్ పార్క్ స్కూల్‌కు చెందిన వారితోపాటు మీరా స్నేహితులను కూడా పోలీసులు విచారిస్తున్నారు.

మీరా చివరిగా ఎవరితో మాట్లాడింది. ఆమె స్నేహితులు ఎవరు తదితర విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మీరా ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాకపోవడంతో.. మీరా చివరిసారిగా ఎవరితో మాట్లాడింది, ఏం మాట్లాడింది అనే విషయాలపై తేనంపేట పోలీసులు మీరా ఫోన్‌ను పరిశీలిస్తున్నారు. విజయ్ ఆంటోని తన కూతురు ఆత్మహత్యపై చేసిన వ్యాఖ్య ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసలు ఆత్మహత్యలకు పాఠశాలలు, తల్లిదండ్రులే కారణమని ఇటీవల ఆయన అన్నారు. పిల్లలపై ఒత్తిడి పెంచవద్దని చెప్పారు. అతని ఈ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే విజయ్ ఆంటోని కూతురు మృతి తమిళ ఇండస్ట్రీలో విషాదాన్ని నింపింది. సినీ ప్రముఖులు విజయ్ ఆంటోనీకి ఫోన్ చేసి విషయం తెలుసుకున్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.