హహ..హాసిని..అమాయమైన చూపులు, ముద్దు ముద్దు మాటలతో అందరినీ ఆకర్షించింది జెనీలియా ( Genelia ).. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.. బొమ్మరిల్లు, రెడీ లాంటి ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాల్లో నటించారు.. జెనీలియా కన్నా కూడా హాసినిగా బాగా ఫెమస్ అయ్యిందీ బ్యూటీ.. మొదటి హీరోయిన్ గా కన్నా సెకండ్ హీరోయిన్ గా బాగా ఫెమస్ అయ్యింది. అయితే ఓ స్టార్ హీరో చేతిలో దారుణంగా మోసపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి..
జెనీలియా నటించిన బొమ్మరిల్లు , ఢీ,రెడీ సినిమాలతో చాలామంది ప్రేక్షకులను ఆకట్టుకుంది . కానీ రాను రాను జెనీలియా సినిమాలు పెద్ద సక్సెస్ ని ఇవ్వలేక పోయాయనే చెప్పాలి.. దాంతో బాలివుడ్ కు వెళ్ళి సెటిల్ అయ్యింది.. అక్కడే రిథెష్ తో ప్రేమలో పడింది.. పెళ్ళి చేసుకుంది. సినిమాలకు గ్యాప్ తీసుకొని పిల్లలకు తల్లైంది..ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ కు రెడీ అవుతుంది..
అయితే జెనీలియాకి మంచి పేరు తెచ్చి పెట్టిన సినిమాలలో బొమ్మరిల్లు కూడా ఒకటి. అందులో అమ్మడు చిన్నపిల్ల మనస్తత్వంతో ప్రేక్షకులకు కనిపించి మెప్పించింది. తెలుగు ప్రేక్షకులకు జెనీలియా అని పేరు గుర్తు రాగానే ముందు హహ హాసిని అని అంటూనే పలకరిస్తారు. ఆ మూవీ రిలీజ్ టైం లో కుర్రాళ్లందరూ పెళ్లిచూపులకు వెళ్లే టైంలో హహహసిని లాంటి అమ్మాయి కావాలి అని చాలామంది అనేవారట..అంతలా ఆ పేరు ఫెమస్ అయ్యింది.
ఇది ఇలా ఉండగా అదే టైంలో టాలీవుడ్ స్టార్ కొడుకు ఆమెను నమ్మించి మోసం చేశాడనే ఓ న్యూస్ వైరల్ గా మారింది. తనతో సినిమాలో నటించిన ఆ హీరో స్క్రిప్ట్ ఒక విధంగా చెప్పి ఒప్పించాడని.. తన పాత్రను సినిమాకి ఓకే చేసే ముందు మరోలా చెప్పి ఒప్పించారని, చివరికి సినిమా చేస్తున్న సమయంలో పూర్తిగా అదుపుతప్పి తను చేసే పాత్రకి అసలు ఇంపార్టెంట్ ఇవ్వలేదని.. డైరెక్టర్ కూడా తన మంచి ఫ్రెండ్ కావడంతో ఇద్దరు కలిసి నా పాత్రను తొక్కేసారని ఆ తరుణంలోని నా సినిమా ప్లాప్ అయ్యిందని జెనీలియా బాధపడిందట..ఆ సినిమా ఏంటో గెస్ చేశారు కదా.. ఆ హీరో కూడా..ఇప్పుడు తెలుగు రీ ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే..ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి మరి..