Veerasimha Reddy : రూటు మార్చిన బాలయ్య..ఆ హీరోయిన్ తో రొమాన్స్..

- Advertisement -

నట సింహం బాలకృష్ణ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.. మాస్ సినిమాలకు కెరాఫ్.. ఆయన చెప్పే పవర్‌ఫుల్‌ డైలాగులు థియెటర్లను దద్దరిల్లేలా చేస్తాయి.. ఈ మధ్య రొమాన్స్ కూడా చేస్తానంటున్నారు బాలయ్య.. హీరోయిన్లతో రొమాంటిక్ సాంగులలో స్టెప్పులు వేస్తూ కేక పెట్టిస్తున్నారు. మొన్నీమధ్య వచ్చిన అఖండ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు బాలయ్యా.. ఆ సినిమా ఏకంగా 200 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టింది.. ఈ సినిమా తర్వాత ఇప్పుడు మరో సినిమాలో చేస్తున్నాడు. బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి‘( Veerasimha Reddy ) మరో నెల రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ సినిమాను డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా, పూర్తి ఫ్యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.. ఇక ఈ సినిమాలో బాలయ్య పాత్రను పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దారు చిత్ర యూనిట్.. ఇక ఈ సినిమా నుండి తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఈ సినిమాలోని రెండో సింగిల్ సాంగ్‌ను డిసెంబర్ 15న ఉదయం 9.42 గంటలకు రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

ఈ పాట పూర్తి రొమాంటిక్ సాంగ్‌గా రాబోతున్నట్లు తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తేఅర్థమవుతోంది. అందాల భామ శ్రుతి హాసన్‌తో కలిసి బాలయ్య అదిరిపోయే స్టెప్స్ వేస్తున్నట్లు ఈ పోస్టర్‌లో కనిపిస్తుంది.. మాస్ గా కనిపించే బాలయ్య ఇలా కనిపించడం పై కొందరు విమర్శలు చేస్తే మరికొంతమంది మాత్రం ప్రశంసలు కురిపిస్తున్నారు..ఇప్పటివరకు సినిమా నుంచి బయటకు వచ్చిన అన్నీ కూడా సినిమా పై హైఫ్ ను క్రియేట్ చేస్తున్నాయి..

- Advertisement -

ఇక థమన్ సంగీతం అందిస్తున్న ‘వీరసింహారెడ్డి’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తుండగా.. దునియా విజయ్, వరలక్ష్మీ శరత్ కుమార్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకూ విడుదల అయిన అన్నీ మంచి టాక్ ను అందుకున్నాయి. అంతేకాదు సినిమా స్టోరీ కూడా మాస్ ఫ్యాన్స్ కు ఊపునిస్తుందని చిత్ర యూనిట్ అభిప్రాయపడుతున్నారు.. చూడాలి మరి సంక్రాంతికి థియెటర్లు దద్దరిల్లిపోతాయో..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here