Kushi : లైగర్ వంటి భారీ డిజాస్టర్ తర్వాత రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ‘ఖుషీ’ చేస్తున్నారు. ఆయనతో కలిసిన సౌత్ స్టార్ బ్యూటీ సమంత సందడి చేస్తోంది. వీరిద్దరి లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ కు శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను పెద్ద చిత్రాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించారు. ఈ సినిమాకు హేషామ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ అందించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబర్ 1న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల అవుతోంది. ఈ చిత్రానికి యూనిట్ ఇప్పటికే ప్రమోషన్లను జోరుగా నడిపిస్తోంది.
ఓవైపు మేకర్స్ ఈ సినిమా నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తూ సినిమాపై అంచనాలను పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ యూట్యూబ్లో భారీ వ్యూయర్ షిప్ తో దూసుకుపోతూ సినిమాపై హైప్ పెంచేశాయి. మరోవైపు విజయ్-సమంత కూడా వరుసగా సినిమాకు సంబంధించి వరుసగా ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. విజయ్ కు లైగర్, సమంతకు శాకుంతలంతో ఇద్దరికీ గత చిత్రాలు డిజాసర్లుగానే నిలిచాయి. దాంతో ఈ సినిమా హిట్ కంపల్సరీగా మారింది. ఇకపోతే ఖుషి మూవీకి విజయ్, సమంత తీసుకున్న రెమ్యునరేషన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.
పాన్ ఇండియా మూవీ కావడంతో విజయ్ దేవరకొండ ఈ సినిమాకు దాదాపు రూ. 25 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడట. తన గత చిత్రం లైగర్ భారీ ఫ్లాప్ అయినా విజయ్ మాత్రం అంత రెమ్యునరేషన్ చార్జ్ చేయడం కొంత విశ్లేషకులకు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరోవైపు సమంత కూడా ఖుషి కోసం రూ. 5 కోట్లు చార్జ్ చేసినట్లు తెలుస్తోంది. అంత రెమ్యునరేషన్ తీసుకున్న విజయ్, సమంతల ‘ఖుషీ’ జనాలను ఏమాత్రం.. ఖుషీ చేస్తుందో?