ప్రభాస్ రికార్డ్ ని కూడా బ్రేక్ చేస్తూ దూసుకుపోతున్న రజనీకాంత్ జైలర్…

- Advertisement -

నిర్మాతలకు లాభాల పంట పండిస్తూ.. కనక వర్షం కురిపిస్తోంది జైలర్ చిత్రం. గత కొద్ది కాలంగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న రజినీకాంత్ ఫాన్స్ కు జైలర్ మూవీ సక్సెస్ దిల్ కుష్ చేస్తోంది. అంతేకాదు ఇప్పటివరకు నెలకొన్నటువంటి రికార్డులను ఒకదాని తర్వాత ఒకటి బద్దలు కొడుతుంది జైలర్ చిత్రం.

జైలర్
జైలర్

బాక్సాఫీస్ వద్ద ఎదురులేకుండా దూసుకుపోతున్న ఈ మూవీ విడుదలైన ఐదు రోజులలో 350 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సరికొత్త రికార్డును సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా 40 కోట్లకు పైగా గ్రాస్ ను 24 కోట్ల షేర్ కలెక్షన్స్ను సొంతం చేసుకోండి. కేవలం 13 కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తో విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాతలకు డబల్ ప్రాఫిట్స్ తెచ్చిపెట్టింది.

ఎన్నడూ కనివిని ఎరుగని రీతిలో ఒక్క నైజం లోనే 11 కోట్లు రాబట్టింది.ఈ మూవీ ఇప్పటికే ప్రభాస్ బాహుబలి, కమల్ హాసన్ విక్రమ్ మూవీస్ క్రియేట్ చేసిన రికార్డులను బద్దలు కొట్టి దూసుకుపోతోంది. కేవలం విడుదలైన ఐదు రోజులలోనే నిర్మాతలకు 50 కోట్ల వరకు ప్రాఫిట్ వచ్చిన ఈ చిత్రం ఇంకా వసూలు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి తెలుగు ఈ చిత్రం పుణ్యమా అని తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ కూడా హ్యాపీగా ఉన్నారు.

- Advertisement -
jailer movie

నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ వహించిన ఈ చిత్రం ఎవరు ఊహించని రేంజ్ లో సక్సెస్ సాధించింది. రజినీకాంత్ పంచ్ మార్క్ డైలాగ్స్, గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్ సీక్వెన్స్.. అన్నిటికి మించి బాగా సెట్ అయ్యే పవర్ ఫుల్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ చిత్రానికి ప్లస్ పాయింట్స్ అని చెప్పవచ్చు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ ఎటువంటి బోర్ కలగకుండా ఎంతో ఆసక్తిగా సినిమా సాగుతుంది. సీరియస్ కాన్సెప్ట్ తో తరికెక్కించిన చిత్రమైనప్పటికీ ఆద్యంతం ఎంటర్టైనింగ్ గా సాగింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here