అమిగోస్ బ్యూటీ ‘Ashika Ranganath ‘ గురించి ఈ విషయాలు తెలుసా..?

Ashika Ranganath


Ashika Ranganath : తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త హీరోయిన్లకు కొదవ లేదు.. మొదటి సినిమాతోనే సీనియర్ హీరోల సరసన నటించే ఛాన్స్ ను కొట్టేస్తున్నారు.. ముఖ్యంగా కన్నడ బ్యూటిల ఎంట్రీ ఎక్కువ అవుతుంది.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే హీరోయిన్ ఆల్రెడీ కన్నడలో ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో బిజీగా ఉంది.. ఆ బ్యూటీ మరెవ్వరో కాదు.. ఆషికా రంగనాథ్.. ఇపుడు కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘అమిగోస్’ మూవీతో టాలీవుడ్‌ కు ఎంట్రీ ఇచ్చింది.

కన్నడలో 2016లో తెరకెక్కిన ‘క్రేజీ బాయ్’ సినిమాతో తెరంగేట్రం చేసింది. ఈ సినిమాలో దిలీప్ ప్రకాష్ హీరోగా నటించారు. ఈ మూవీ అక్కడ మంచి సక్సెస్ అందుకుంది..ఆ తర్వాత శివ రాజ్‌కుమార్ హీరోగా తెరకెక్కిన ‘మాస్ లీడర్’ సినిమాలో నటించింది. అటు దివంగత .. పునీత్ రాజ్‌కుమార్ హీరోగా నటించిన ‘జేమ్స్’లో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ..

Ashika Ranganath
Ashika Ranganath

2016లో కన్నడలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఇప్పటి వరకు వేరే భాషల్లో పెద్దగా నటించలేదు. 2022లో అథర్వ హీరోగా నటించిన ‘పట్టాతు అరసన్’ మూవీతో తమిళంలో ఎంట్రీ ఇచ్చింది.. అయితే కన్నడ చిత్ర పరిశ్రమతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ పెద్దగా పక్క భాషలపై ఫోకస్ పెట్టలేదు.

2022లో తొలిసారి అథర్వ హీరోగా నటించిన ‘పట్టాతు అరసన్’ సినిమాతో తమిళంలో కాలు పెట్టింది..అమిగోస్ మూవీతో తెలుగులో ఎంట్రీ ఇవ్వనుంది.. 1996 ఆగష్టు 5న రంగనాథ్, సుధ దంపతులకు కర్ణాటకలోని బెంగళూరు సమీపంలోని తుముకూరులో జన్మించారు. ఈమె అక్క అనుష రంగనాథ్ కూడా హీరోయిన్‌గా తన లక్ పరీక్షించుకుంది..

Ashika Ranganath
Ashika Ranganath

ఇక విద్యాభ్యాసం కూడా అక్కడే పూర్తి చేశారు.. తర్వాత 2014 మిస్ ఫ్రెస్ ఫేస్ బెంగళూరుగా ఎంపికైంది. అంతేకాదు చిన్నప్పటి నుంచి వివిధ నృత్య రీతులను నేర్చుకుంది. ఇక హీరో సిద్ధార్ధ్ అంటే ఇష్టమని పలు సందర్భాల్లో ప్రస్తావించింది. మొత్తంగా అమిగోస్‌ మూవీతో ఎంట్రీ ఇవ్వబోతున్న ఈ అమ్మడు తన సత్తాను ఎలా చాటుతుందో చూడాలి.. ఈ సినిమా హిట్ అయితే మాత్రమే నెంబర్ వన్ హీరోయిన్ ఆషికా రంగనాథ్ అవ్వడం ఖాయం..