Mahesh Babu వేసుకున్న ఈ టీ షర్ట్ విలువ ఎంతో తెలుసా..? ఆ ధర తో ఒక మధ్య తరగతి కుటుంబం బ్రతకొచ్చు!

- Advertisement -

Mahesh Babu : గత రెండు మూడు రోజుల నుండి సూపర్ స్టార్ మహేష్ బాబు వేసుకున్న ఆరంజ్ కలర్ టీ షార్ట్ సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. విక్టరీ వెంకటేష్ తో కలిసి ఒక క్లబ్ హౌస్ ఓపెనింగ్ కి వెళ్లిన మహేష్, అక్కడ సరదాగా వెంకటేష్ తో కలిసి రమ్మీ గేమ్ ఆడిన ఫోటోలు ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మహేష్ బాబు పేకాట ఆడుతున్నాడు అంటూ సోషల్ మీడియా లో ప్రచారం జరిగింది.

Mahesh Babu
Mahesh Babu

ఆ తర్వాత ఆరాలు తియ్యగా అది క్లబ్ హౌస్ ఓపెనింగ్ అని తేలింది. ఈ ఫొటోస్ లో మహేష్ వేసుకున్న టీ షర్ట్ అభిమానులను ప్రత్యేకంగా ఆకర్షించింది. తమ అభిమాన హీరో వేసుకునే దుస్తులను కొనుగోలు చెయ్యడానికి అమితాసక్తిని చూపించే ఫ్యాన్స్, ఈ షర్ట్ ని కూడా కొనడానికి గూగుల్ మొత్తం వెతకడం ప్రారంభించారు.

Mahesh Babu  Venkatesh

పది వేల రూపాయిల లోపు ఆ టీ షర్ట్ ఉంటే కోనేసేవారే, కానీ ఆ టీ షర్ట్ విలువ అక్షరాలా 1 లక్ష 31 వేల రూపాయిలు. చూసేందుకు చాలా సింపుల్ గా అనిపిస్తున్న ఈ టీ షర్ట్ ధర అంత ఉంటుందా? అని ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. మధ్య తరగతి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు అంత డబ్బులు ఖర్చు ఎలా చెయ్యగలరు. ఆ డబ్బుతో ఒక నెల ఎలాంటి చీకుచింతా లేకుండా బ్రతికేయొచ్చు.

- Advertisement -
Mahesh Babu T Shirt Price

మహేష్ ఫ్యాన్స్ లో రిచ్ పీపుల్ ఎవరైనా ఉంటే క్షణం కూడా ఆలోచించకుండా ఈ టీ షర్ట్ ని కోనేయండి. ఈ టీ షర్ట్ ఫ్లిప్ కార్ట్ తో పాటుగా అమెజాన్ లో కూడా అందుబాటులో ఉంది. ఇకపోతే మహేష్ బాబు ప్రస్తుతం ‘గుంటూరు కారం ‘ చిత్రం చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా జనవరి 12 న గ్రాండ్ గా విడుదల కాబోతుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here