Gopichand : మెగాస్టార్ కు విలన్ గానా.. చచ్చినా చేయనని గోపీచంద్ రిజెక్ట్ చేసిన సినిమా ఏంటో తెలుసా?

- Advertisement -

Gopichand : టాలీవుడ్ టాలెంటెడ్ హీరో గోపీచంద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత విలన్ గా మారి మళ్లీ హీరోగా అవడం ఇండస్ట్రీలో ఒక్క గోపీచంద్ కు మాత్రమే సాధ్యం అయింది. విలన్ గా ఆయన ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టి జ‌యం, వ‌ర్షం, నిజం వంటి సినిమాలు చేసిన విలనిజానికి మారు పేరుగా నిలిచారు.

Gopichand

ఆ సినిమాల్లో ఆయన నటనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆపై మ‌ళ్లీ హీరోగా ట‌ర్న్ తీసుకుని బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ స్టార్ ఇమేజ్ దక్కించుకున్నారు. హీరోగా నిల‌దొక్కుకున్న గోపీచంద్ విల‌న్ పాత్రలు చేసేందుకు మొగ్గు చూపలేదు. ఈ క్రమంలో వచ్చిన చాలా సినిమాలు రిజెక్ట్ చేశాడు. ఈ లిస్ట్ లో మెగాస్టార్ చిరంజీవి సినిమా కూడా ఉంది? అవును.. చిరంజీవికి విల‌న్ గా చేసే అవ‌కాశం వ‌స్తే చ‌చ్చినా చేయనంటూ గోపీచంద్ ఓ సినిమా రిజెక్ట్ చేశాడు. అది మరేదో కాదు మ‌ల‌యాళ సూప‌ర్ హిట్ లూసీఫ‌ర్ కు రీమేక్ గా తెరకెక్కిన గాడ్ ఫాద‌ర్ సినిమా.

Gopichand

ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో చిరంజీవి హీరోగా న‌టిస్తే.. ఆయ‌న చెల్లెలుగా లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార యాక్ట్ చేసింది. న‌య‌న‌తార‌కు భ‌ర్తగా విల‌న్ పాత్రలో హీరో సత్యదేవ్ నటించాడు. అయితే మొద‌ట ఆ పాత్ర కోసం హీరో గోపీచంద్ ను సంప్రదించారట. కానీ, గోపీచంద్ మాత్రం గాడ్ ఫాద‌ర్ ను రిజెక్ట్ చేశారు. విల‌న్ పాత్ర బ‌లంగా లేద‌ని చెప్పి సున్నితంగా నో చెప్పారు. ఆ త‌ర్వాత స‌త్య దేవ్ ను విలన్ పాత్ర కోసం తీసుకున్నారు. కాగా, గత ఏడాది విడుద‌లైన గాడ్ ఫాద‌ర్ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here