Actor Haranath : వామ్మో..ఆ హీరో అంటే హీరోయిన్లకు అంత పిచ్చా..రూమ్ లో అలా..

actor haranath


సినీ ఇండస్ట్రీలో కొందరు అందమైన వారు ఉంటారు.మరి కొంతమంది మంచి మనసున్న వారు ఉంటారు. వారి కోసం సినీ ఇండస్ట్రీ దాసోహం అంటుంది.. అలాంటి క్రేజ్ ఉన్న ఓ హీరో తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు. ఆయన ఎవరో కాదు తొలి తెలుగు అందాల హీరోగా పేరు తెచ్చుకున్న హరనాథ్ Actor Haranath మద్యానికి బానిసై కెరీర్ ను నాశనం చేసుకున్నారని చాలామంది భావిస్తారు. ఓ ప్రముఖ సినీ జర్నలిస్ట్ ఒక ఇంటర్వ్యూలో హరనాథ్ గురించి మాట్లాడుతూ ఎన్నో షాకింగ్ వెల్లడించారు. హరనాథ్ రాజుల కుటుంబానికి చెందినవారని కాకినాడలో హరనాథ్ స్టూడెంట్స్ కు సమస్య వస్తే ఉల్లిపాయ బాంబులు విసిరారని ఆయన చెప్పుకొచ్చారు. తనతో పాటు ఉండే ప్రతి ఒక్కరికీ హరనాథ్ డబ్బు ఖర్చు చేసేవారని ప్రముఖ జర్నలిస్ట్ కామెంట్లు చేశారు.

ఎవరైనా జీవితంలో ఉన్నత స్థానాలకు వెళ్లాలంటే ఆర్థిక క్రమశిక్షణ ఉండాలి. కెరీర్ పరంగా ఎదిగే సమయంలో తప్పులు చేస్తే మాత్రం ఆ తప్పులకు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఎంతోమంది సెలబ్రిటీలు స్టార్ స్టేటస్ ను పొందినా చివరి రోజుల్లో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సెలబ్రిటీల వారసులలో కొందరు ప్రస్తుతం దీనస్థితిని ఎదుర్కొంటున్నారు. చివరి రోజుల్లో ఇబ్బందులు పడి వార్తల్లో నిలిచిన వాళ్లలో ఈయన ఒకరు..

Actor Haranath
Actor Haranath

ఆయన ఈరోజు వచ్చిన డబ్బులను డబ్బును ఆరోజే ఖర్చు చేసేవారని సమాచారం. మద్రాస్ లోని అయ్యంగార్ లేడీస్ ఖరీదైన హోటల్ రూమ్స్ ను బుక్ చేసి కార్లలో వచ్చి హరనాథ్ ను బలవంతంగా హోటల్ రూమ్ కు తీసుకెళ్లేవారని తెలుస్తోంది. అప్పట్లోనే హరనాథ్ కు ఈ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఈ రీజన్ వల్లే తన సినిమాలో హరనాథ్ నటించే సమయంలో సీనియర్ ఎన్టీఆర్ మద్యం తాగకూడదని, మాంసం తినకూడదని, అమ్మాయిలతో ఎక్కడికీ వెళ్లకూడదని నిబంధనలు విధించారట.

మా ఇంటి మహాలక్ష్మి సినిమాతో హీరోగా హరనాథ్ కెరీర్ మొదలైంది. ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత హరనాథ్ అని అప్పట్లో ఇండస్ట్రీలో వినిపించేది. అయితే కొంతమంది హీరోలు హరనాథ్ ను తొక్కేశారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఆయన తాగుబోతు కాకపోయినా కొంతమంది ఆ ముద్ర వేశారని తెలుస్తోంది. ఎవరైనా డబ్బులు ఇచ్చినా హరనాథ్ ఎక్కువ డబ్బులు తీసుకునేవారు కాదని సమాచారం. బ్రహ్మ రాతను ఎవరూ మార్చలేరు అని ఈయన జీవితాన్ని ఉదాహరణగా చెప్పొచ్చు..