పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘భీమ్లా నాయక్’ చిత్రం గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిల్చిన సంగతి తెలిసిందే. మలయాళం లో సూపర్ హిట్ గా నిల్చిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాకి, ఆంధ్ర ప్రదేశ్ లో అసలు టికెట్ రేట్స్ లేకపోయినప్పటికీ కూడా ఈ చిత్రం సుమారుగా వంద కోట్ల రూపాయిల షేర్ రాబట్టింది.
ఇందులో పవన్ కళ్యాణ్ కి ఎంత మంచి పేరు వచ్చిందో ఆయనతో సమానంగా రానా కి కూడా అంతే మంచి పేరు వచ్చింది. యాటిట్యూడ్ తో ఎంతో పొగరు తో పవన్ కళ్యాణ్ కి సరిసమానంగా పోటీ పడుతూ పెర్ఫార్మన్స్ ఇరగదీసాడు.బాహుబలి సిరీస్ తర్వాత ఆయనకీ పడినటువంటి అద్భుతమైన పాత్ర ఇదే.
అయితే ఈ పాత్ర కోసం రానా కంటే ముందుగా ఇద్దరు హీరోల కోసం ప్రయత్నం చేశారట. ఒకరు గోపీచంద్ కాగా, మరొకరు మాస్ మహారాజ రవితేజ. రవితేజ ని స్వయంగా పవన్ కళ్యాణ్ కోరారట, ఆయన ఫోన్ చేసి అడగగా, అప్పటికే వేరే సినిమాలకు డేట్స్ మొత్తం కేటాయించి ఉందని, నటించాలని ఉన్నా నటించలేకపోతున్నానని రవితేజ చెప్పాడట. పవన్ కళ్యాణ్ కూడా మరేం పర్వాలేదు అని చెప్పి కాల్ కట్ చేసాడట.
ఆ తర్వాత త్రివిక్రమ్ ఈ పాత్రకి గోపీచంద్ అయితే ఎలా ఉంటుంది అని పవన్ కళ్యాణ్ ని సలహా అడగగా, ఆయన రానా ని సూచించినట్టు తెలుస్తుంది. రానాకీ కథ చెప్పగానే వెంటనే ఒప్పుకొని ఈ సినిమా చేసాడని, ఆ తర్వాత జరిగింది మొత్తం మనకి తెలిసిందే అని అంటున్నారు ఈ సినిమాకి పని చేసిన యూనిట్ సభ్యులు. ఒకవేళ ఈ సినిమాని రవితేజ ఒప్పుకొని ఉండుంటే, మూవీ రేంజ్ ఇంకా ఎక్కువ ఉండేది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.