‘కస్టడీ’ మొట్టమొదటి రివ్యూ.. నాగ చైతన్య కెరీర్ లో ల్యాండ్ మార్క్ లోడింగ్..!

- Advertisement -

కస్టడీ అక్కినేని ఫ్యాన్స్ కి ఇప్పుడు అర్జెంట్ గా ఒక హిట్ కావలి, లేకుంటే మనుగడ కష్టం అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి.’బంగార్రాజు’ సినిమా తర్వాత విడుదలైన ‘థాంక్యూ’, ‘ది ఘోస్ట్’ మరియు ‘ఏజెంట్’ చిత్రాలు బాక్స్ ఆఫీస్ డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచి కనీసం 10 కోట్ల రూపాయిల షేర్ ని కూడా రాబట్టలేకపోయింది. ఫ్యాన్స్ పూర్తిగా విసుగెత్తి పోయారు, ఇలాంటి సమయం వాళ్ళ ఫ్యానిజం ఆపకుండా ఉండాలంటే కచ్చితంగా ఒక భారీ బ్లాక్ బస్టర్ కావాలి.

కస్టడీ
కస్టడీ

అలాంటి సినిమా నాగ చైతన్య లేటెస్ట్ గా నిల్చిన ‘కస్టడీ’ నిలుస్తుందని బలంగా నమ్ముతున్నారు ఫ్యాన్స్. ఎందుకంటే రీసెంట్ గా విడుదల చేసిన టీజర్ మరియు ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఈ చిత్రం కచ్చితంగా మంచి థ్రిల్లింగ్ అనుభూతి ఇచ్చే చిత్రం గా నిలుస్తుందని అనిపిస్తుంది.ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన మొదటి కాపీ ని రీసెంట్ గానే ప్రసాద్ ల్యాబ్స్ లో కొంతమంది సినీ ప్రముఖులకు వేసి చూపించారు.రెస్పాన్స్ ఎలా ఉందొ ఒకసారి చూద్దాము.

సినిమా విషయానికి వస్తే ఈ చిత్రం లో నాగ చైతన్య చాలా కొత్తగా కనిపించాడట.ప్రారంభంలో 20 నిమిషాలు కాస్త స్లో గా ఉంటుందని, 20 నిమిషాల తర్వాత అసలు కథ మొదలు అవుతుందని, 40 వ నిమిషం నుండి క్లైమాక్స్ వరకు సీట్ ఎడ్జి థ్రిల్లర్ గా ఈ చిత్రం ఉందని తెలుస్తుంది. నాగ చైతన్య మరియు అరవింద్ గో స్వామి మధ్య జరిగే సన్నివేశాలు మొత్తం సినిమాకి హైలైట్ గా ఉంటాయట.

- Advertisement -

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా యువన్ శంకర్ రాజా అదరగొట్టేసినట్టు సమాచారం.మొత్తానికి ఈ చిత్రం నాగ చైతన్య కెరీర్ లోనే ల్యాండ్ మార్క్ అని చెప్పుకునే విధంగా ఉంటుందని,కమర్షియల్ గా 50 కోట్ల రూపాయిల షేర్ కి పైగానే వసూళ్లను రాబడుతుందని అంటున్నారు విశ్లేషకులు.చూడాలి మరి అనుకున్నట్టు విధంగానే ఈ సినిమా సక్సెస్ సాధిస్తుందా లేదా అనేది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here