Ram Charan : తెలుగు హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి అందరికి తెలుసు.. ఇప్పుడు గ్లోబల్ స్టార్ హీరో అయ్యాడు.. ట్రిపుల్ ఆర్ సినిమాతో ప్రపంచం మెచ్చిన స్టార్ హీరో అయ్యాడు.. ఇక ఇప్పుడు వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నాడు.. అయితే రామ్ చరణ్ ఇంటర్వ్యూ ఇచ్చిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.. ఆయన సినిమా విశేషాల నుంచి ఆయన మొదట ఎవరిని ప్రేమించారు అనే విషయాలు ఆసక్తికరంగా మారాయి.. హాలీవుడ్ హీరోయిన్స్ జూలియా రాబర్ట్స్, కేథరీన్ జీటా జోన్స్ అంటే నాకు చాలా ఇష్టం. జూలియా రాబర్ట్స్ నా ఫస్ట్ క్రష్. ఆమెను టీవీలో చూసినా, బిగ్ స్క్రీన్‌పై చూసినా కళ్లార్పకుండా అలా చూస్తూ ఉండిపోతానని అన్నాడు.. దాన్ని విన్న ఫ్యాన్స్ రామ్ చరణ్ లో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ ప్రచారం చేస్తున్నారు.. అది ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది.

చెర్రి తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు మెగా ఫ్యాన్స్ తో పంచుకుంటూ వస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్నేషనల్ సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫారమ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చరణ్ ఫస్ట్ క్రష్ ఎవరని ఓ అభిమాని ప్రశ్నించగా ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.. అంతేకాదు రామ్ చరణ్ కు చాలా ఇష్టమైన వారిని కూడా చెప్పినట్లు తెలుస్తుంది. హాలీవుడ్ హీరోయిన్స్ జూలియా రాబర్ట్స్, కేథరీన్ జీటా జోన్స్ అంటే నాకు చాలా ఇష్టం. జూలియా రాబర్ట్స్ నా ఫస్ట్ క్రష్. ఆమెను టీవీలో చూసినా, బిగ్ స్క్రీన్‌పై చూసినా కళ్లార్పకుండా అలా చూస్తూ ఉండిపోతాను. ఆమె నన్ను అంతగా ఆకర్షిస్తుంది. ‘ప్రెట్టీ ఉమెన్’ చూశాక, ఆమెకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను. నా మరో క్రష్.. కేథరిన్ జెటా జోన్స్. ఆమె నటించిన సినిమాల్లో నేను మొదట చూసింది ‘ది మార్క్ ఆఫ్ జోరో’. ఆ మువీలో కేథరిన్ నటన నన్నెంతో ఆకట్టుకుంది’ అని అన్నారు..

అలాగే ఇంటరాక్షన్ సమయంలో సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్స్‌ను ఇంటర్వ్యూవర్ ఒక్కొక్కటిగా చదివి వినిపించారు. వారిలో ఓ అభిమాని చరణ్‌ను ‘స్నాక్’ అని అభివర్ణించారు. దీంతో చరణ్ పెద్ద నవ్వి ఈ కామెంట్‌ను నా వైఫ్ వింటే గర్వంగా ఫీలవుతుందన్నాడు. ఇక సినిమాల విషయానికొస్తే.. స్టార్ డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ తదుపరి మువీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో రూపందుతున్న rc 15 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు..ఈ ఏడాది లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది..