ఓరి నాయనో.. Honey Rose యవ్వారం మాములుగా లేదుగా.. ఒకేసారి అంత పెంచేసిందా?

- Advertisement -

Honey Rose ఈ మధ్య ఈ పేరు తెగ వినిపిస్తుంది.. ఇక సోషల్ మీడియాలో అయితే చెప్పనక్కర్లేదు.. హాట్ ఫొటోలతో యువతకు మత్తెక్కిస్తుంది..ఎక్కడ షాపింగ్ మాల్ ఓపెన్ అవుతున్నా కూడా ఈ అమ్మడే దర్శనమిస్తుంది.. దాంతో యూత్ తో పాటు జనాల్లో కూడా మంచి క్రేజ్ ను అందుకుంది..ఇక ఇప్పుడు ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది.. ఈ అమ్మడు నిర్మాతలకు చుక్కలు చూపిస్తూ డిమాండ్ ను పెంచేసిందని టాక్..ఈ వార్త ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది..

Honey Rose
Honey Rose

ఈ ఏడాది బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన వీరసింహారెడ్డి సినిమాలో మీనాక్షి క్యారెక్టర్ లో నటించి ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయింది. ప్రస్తుతం తెలుగు కుర్రాళ్ల కలల రాకుమారిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మకు విపరీతమైన పాపులారిటీ లభిస్తోందని చెప్పాలి. ఒకప్పుడు ఎవరూ పట్టించుకోని ఈమెకు ఇప్పుడు వరుసగా ఆఫర్లు కూడా వస్తున్నాయి.. తన అందాలతో యువతను ఉర్రూతలూగిస్తున్న హనీ రోజ్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ మరింత పాపులారిటీ దక్కించుకుంటుంది. నిజానికి హనీ రోజ్ మలయాళ నటి.. అక్కడ మోహన్ లాల్ తో ఒక సినిమాలో నటించి సూపర్ హిట్ అందుకుంది. ఆ సినిమా తర్వాత ఈమెకు బాలీవుడ్ లో క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఇప్పుడు టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ కంటపడడంతో ఇక్కడ కూడా పాపులారిటీ దక్కించుకుంది…

Honey

తెలుగు , తమిళ్, మలయాళ భాషల్లో అవకాశాలు అందుకోవడమే కాదు ఎక్కువగా ప్రమోషన్స్ తో కూడా భారీ క్రేజ్ దక్కించుకుంటుంది.. తాజాగా హైదరాబాదులో కూడా ఒక హోటల్ ప్రారంభోత్సవంలో పాల్గొనింది.. అయితే చాలా మంది ఈమె రెమ్యూనరేషన్ గురించి ఆలోచిస్తున్నారు..ఒక్కో షాప్ ఓపెనింగ్ కి వెళ్తే దాదాపు రూ.8 లక్షలు తీసుకుంటుందట. ఇక హనీ రోజ్ ను చూడడానికి ఫ్యాన్స్ ఎక్కువగా రావడంతోనే ఆమెకు ఆ రేంజ్ లో పారితోషకం లభిస్తుందని చెప్పవచ్చు.. ఇక సినిమాలకు కూడా రెమ్యూనరేషన్ భారీగా పెంచిందని వార్తలు వినిపిస్తున్నాయి.. ప్రస్తుతం ఈమె వరుస సినిమాల్లో నటిస్తుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here