యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైంది. మొదటి ఆట నుండే ఫస్ట్ హాఫ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది కానీ, సెకండ్ హాఫ్ మొత్తం ఎప్పుడెప్పుడు సినిమా అయిపోతుందా, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్లిపోదామా అన్నట్టు ఉంది అంటూ సోషల్ మీడియా లో ట్రోల్ల్స్ వచ్చాయి.

ముఖ్యంగా రావణాసురిడి గెటప్ ని చూసి అందరూ నవ్వుకుంటున్నారు. ఆ పాత్ర పోషించిన సైఫ్ అలీ ఖాన్ నడక , నడవడిక మొత్తం ఒక ఎత్తు అయితే, ఆయన పది తలలను చూపించిన తీరు మరో ఎత్తు. మన పురాణాలను పరిశీలిస్తే, రావణాసురిడి 10 తలలు ఒకే లైన్ లో ఉంటుంది. కానీ ఇక్కడ మీద ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అన్నట్టుగా ఉంటుంది. ఇదే ఇప్పుడు సోషల్ మీడియా లో మోస్ట్ ట్రోలింగ్ మెటీరియల్ అయిపోయింది.

అసలు ప్రభాస్ ఇదంతా చూసి ఎలా సైలెంట్ గా ఉన్నాడు..?, బాహుబలి లాంటి దేశం గర్వించదగ్గ చిత్రాలలో నటించిన ప్రభాస్ కి, అందుకు గ్రాఫిక్స్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ పర్ఫెక్షన్ చూసి కూడా, ఇలాంటి వాటిని ఎలా ప్రోత్సహించాడు అనే సందేహం ప్రతీ ఒక్కరికీ కలుగుతుంది. రామాయణం ని మోడరన్ వే లో చూపించాలి అనే ప్రయత్నం లో మన ఇతిహాసం ని అవహేళన చేసినట్టు అయ్యింది చివరికి.

ముందుగా విడుదల చేసిన ఆదిపురుష్ టీజర్ లో రావణాసురుడి తలలు మన పురాణాలలో ఉన్నట్టుగానే ఒక్కే వరుసలో ఉన్నింది, కానీ అప్పట్లో టీజర్ పై ట్రోల్ల్స్ ఒక రేంజ్ లో వచ్చిన తర్వాత, దానిపై రీవర్క్ చేసి చివరికి ఇలా చేసారు. కేవలం ఈ క్రింద కనిపించే షాట్ పై రీ వర్క్ చేసేందుకు 20 కోట్లు ఖర్చు చేశారట. డబ్బులను మంచి నీళ్లు లాగ ఖర్చు చేసి తీసిన ఈ సినిమా కి ఇలాంటి ఔట్పుట్ ఉంటుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఇన్ని రోజులు ట్రైలర్ లో రావణాసురిడి పది తలలను ఎందుకు చూపించకుండా దాచిపెట్టారో ఇప్పుడు అర్థం అయ్యింది అందరికీ.
