ఆదిపురుష్ : బీరు బాటిల్ తో చెయ్యికోసుకొని కటౌట్ కు రక్తతిలకం దిద్దిన ఫ్యాన్..!

- Advertisement -

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతీయ బాషలలో విడుదలై నెగటివ్ టాక్ ని తెచ్చుకుంది. గ్రాఫిక్స్ వర్క్ ఆశించిన స్థాయిలో లేదని, డైరెక్టర్ ఓం రౌత్ ఫస్ట్ హాఫ్ చాలా బాగా తీసాడని, కానీ సెకండ్ హాఫ్ మాత్రం ఫస్ట్ హాఫ్ లో ఉన్న దాంట్లో పావు శాతం కూడా లేదని, డైరెక్టర్ ఓం రౌత్ కాస్త శ్రద్ద పెట్టి సెకండ్ హాఫ్ యావరేజి గా తీసి ఉన్న, గ్రాఫిక్స్ అనుకున్న రేంజ్ లో పెట్టి ఉన్నా, ఈ చిత్రం వెయ్యి కోట్ల రూపాయిలు కొల్లగొట్టేదని అంటున్నారు విశ్లేషకులు. కానీ టాక్ తో సంబంధం లేకుండా సౌత్ నుండి నార్త్ వరకు అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఈ సినిమా రికార్డు ఓపెనింగ్ ని దక్కించుకుంది. ఇది ఇలా ఉండగా ప్రభాస్ ప్రతీ సినిమాకి అభిమానులు సంబరాలు చెయ్యడం సర్వసాధారణమైన విషయం.

ఆదిపురుష్
ఆదిపురుష్

ఆయన సినిమా వచ్చిందంటే చాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఎక్కడ చూసిన బ్యానర్లు మరియు కటౌట్లతో నిండిపోయి ఉంటుంది. పాలాభిషేకాలు , రక్తాభిషేకాలు కూడా జరుగుతుంటాయి. ప్రభాస్ కి ఇక్కడ అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇది ఇలా ఉండగా నేడు ఒక అభిమాని థియేటర్ వద్ద బీర్ బాటిల్ ని పగలగొట్టి, ఆ గాజు పెంకు తో చెయ్యి కోసుకొని, ఆ రక్తాన్ని తీసి ప్రభాస్ పోస్టర్ కి అద్దుతాడు. చెయ్యి మొత్తం రక్తం ధారలుగా కారిపోతున్న కూడా ఏమాత్రం పట్టించుకోకుండా, అతని చేసిన ఈ చర్య నేషనల్ లెవెల్ లో ట్రెండ్ అయ్యింది.

కొంతమంది ఈ అభిమానం ని చూసి ఇదేమి పిచ్చి, రక్తం తో ఇలా చెయ్యడం మహాపాపం అంటూ తిట్టడం ప్రారంభించారు. అభిమానం కొంతవరకు ఉంటె బాగుంటుంది, అది హద్ద్దులు దాటితే మాత్రం చాలా కష్టం, తల్లి తండ్రులు మిమ్మల్ని కన్నది హీరోల కోసం కాదు అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. మరో పక్క ఆదిపురుష్ సినిమాకి సంబంధించిన ఒక థియేటర్ లో సౌండ్ సిస్టం సరిగా లేదని అభిమానులు థియేటర్ అద్దాలను పగలగొట్టారు. ఇలా ఎన్నో సంఘటనలకు వేదికగా మారింది ఆదిపురుష్ మూవీ.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here