Bhagavanth Kesari : ఈ ఏడాది ప్రారంభం లో సంక్రాంతి కానుకగా బాలయ్య నటించిన ‘వీర సింహా రెడ్డి’ చిత్రం విడుదలై మంచి సూపర్ హిట్ గా నిల్చిన సంగతి అందరికీ తెలిసిందే. ‘అఖండ’ వంటి సూపర్ హిట్ తర్వాత, వెంటనే మరో బ్లాక్ బస్టర్ రావడం బాలయ్య అభిమానులకు చెప్పలేనంత ఆనందాన్ని కలిగించింది. ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి తో కలిసి ‘భగవంత్ కేసరి’ అనే చిత్రం చేసాడు.
దసరా కానుకగా ఈ నెల 20 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా పై అభిమానుల్లో ఉన్న అంచనాలు మామూలివి కావు. ఇప్పటికే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు అవ్వగా, బాలయ్య కెరీర్ లోనే అత్యధిక ప్రీమియర్ వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలవబోతుంది. ఇక పోతే ఈ సినిమాకి జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ఇప్పుడు ఇండస్ట్రీ లో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది.
బాలయ్య గత రెండు చిత్రాలు దాదాపుగా 70 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించాయి. కాబట్టి ‘భగవంత్ కేసరి’ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి 70 కోట్ల రూపాయిల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇది బాలయ్య కెరీర్ లో ఆల్ టైం హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ గా చెప్పుకోవచ్చు. నైజాం ప్రాంతం లో 15 కోట్లు, సీడెడ్ లో ప్రాంతం లో 14 కోట్లు , ఉత్తరాంధ్ర లో 8 కోట్ల 20 లక్షలు, గుంటూరు జిల్లాలో 6 కోట్లు, తూర్పు గోదావరి జిల్లా 5 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లా 4 కోట్ల 20 లక్షలు , కృష్ణ జిల్లా 4 కోట్ల 25 లక్షలు, నెల్లూరు జిల్లా 2 కోట్ల 60 లక్షల రూపాయిలు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
కేవలం తెలుగు రాష్ట్రాల నుండి 59 కోట్లు, ఓవర్సీస్ మరియు కర్ణాటక ప్రాంతాలకు కలిపి 70 కోట్ల రూపాయిల వరకు బిజినెస్ జరిగిందని టాక్. సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే టాక్ అఖండ రేంజ్ లో రావాలి అని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఎందుకంటే ఈసారి ‘భగవంత్ కేసరి‘ తో పాటు రెండు పెద్ద సినిమాలు విడుదల అవుతున్నాయి.