Allu Arjun : ‘బొమ్మరిల్లు’ చిత్రం లోని ఈ సన్నివేశం లో అల్లు అర్జున్ ఉన్నాడు.. ఎవరైనా గుర్తుపట్టారా?

- Advertisement -

Allu Arjun : తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఎప్పటికీ గుర్తించుకునే కల్ట్ క్లాసిక్ చిత్రాలలో ఒకటి ‘బొమ్మరిల్లు’. అప్పట్లో యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఏర్పాటు చేసుకున్న సిద్దార్థ్ హీరో గా నటించిన ఈ సినిమా ఆరోజుల్లో ఇండస్ట్రీ లో ఎన్నో రికార్డ్స్ ని బద్దలు కొట్టి చరిత్ర తిరగరాసింది. ఈ చిత్రానికి దర్శకుడిగా భాస్కర్ వ్యవహరించాడు. ఇది ఆయనకి తొలి సినిమా, అప్పట్లో దిల్ రాజు నిర్మించే సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఎక్కువగా పని చేసాడు.

Allu Arjun
Allu Arjun

ఆ తర్వాత దిల్ రాజు ఇతనిలో టాలెంట్ ని గుర్తించి బొమ్మరిల్లు స్టోరీ ని విని, వెంటనే ఆ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభించాడు. అలా ప్రారంభమైన ఈ సినిమా ఆరోజుల్లోనే 20 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించింది. ముఖ్యంగా నైజాం ప్రాంతం లో పోకిరి తర్వాత 10 కోట్లు దాటిన సినిమాగా నిల్చింది.

Siddharth genelia

ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా షూటింగ్ సమయం లో హీరోయిన్ జెనీలియా కి చిరాకు కల్గిన ఒక సన్నివేశం గురించి రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు భాస్కర్. ‘అప్పుడో ఇప్పుడో’ సాంగ్ ముందు అర్థరాత్రి సిద్దార్థ్ మరియు జెనీలియా కలిసి ఐస్ తినడానికి వెళ్తారు కదా?, ఆ సన్నివేశం ని సరిగా తీసేందుకు భాస్కర్ ఎన్నో తిప్పలు పడ్డాడు అట. అతను అనుకున్న విధంగా ఔట్పుట్ రాలేదు. రాత్రి ప్రారంభిస్తే, తెల్లవారు జామున వరకు ఆ సన్నివేశం ని తీస్తూనే ఉన్నాడు.

- Advertisement -
Bommarillu

జెనీలియా కి చాలా కోపం వచ్చేసింది, రాత్రి నుండి ఇప్పటి వరకు ఈ చిన్న డైలాగ్ ఉన్న సన్నివేశం తీస్తావా, ఏమి తమాషాగా ఉందా?, నేను అసలు ఈ సినిమానే చెయ్యను అని కార్వాన్ లోకి వెళ్లిపోయిందట. ఆరోజు అప్పుడే షూటింగ్ కి అల్లు అర్జున్ వచ్చాడు. జరిగిన విషయం ని అల్లు అర్జున్ కి భాస్కర్ వివరించాడు. అప్పుడు అల్లు అర్జున్ వెంటనే జెనీలియా వద్దకి వెళ్లి, అతను చాలా మంచి డైరెక్టర్, ఎదో ఒక్క సన్నివేశం ని చూసి నిర్ణయం తీసుకోకు, ఈ సినిమా చెయ్యి అని నచ్చచెప్పి మళ్ళీ షూటింగ్ కి తీసుకొచ్చాడట జెనీలియా ని అల్లు అర్జున్. ఈ విషయం స్వయంగా బొమ్మరిల్లు భాస్కర్ చెప్పాడు. అలా ఆ సన్నివేశం ని అల్లు అర్జున్ సమక్ష్యం లో షూట్ చేశారట.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here