VIjay Deverakonda కు ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలిస్తే కళ్లు తేలేస్తారు..!

- Advertisement -

ఓవర్ నైట్ స్టార్ హీరో Vijay Deverakonda గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..ఒక్క సినిమాతో స్టార్ హీరో అయ్యాడు.. అతి తక్కువ కాలంలోనే బాగా ఫెమస్ అయ్యాడు.. గతంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో చేసిన ఈయన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో ఫుల్ లెన్త్ క్యారెక్టర్ చేసి చివర్లో మరణించి అందరినీ కంటతడి పెట్టించారు.. దాంతో భారీ పాపులారిటీ దక్కించుకున్నారు విజయ్ దేవరకొండ.. ఆయన నటనకు ఫిదా అయిన డైరెక్టర్స్ హీరోగా ఛాన్స్ ఇచ్చారు.. అలా హీరోగా కెరియర్ ను మొదలు పెట్టిన విజయ్ వరుస సినిమాలు చేస్తున్నాడు..ప్రస్తుతం విజయ్ గురించి ఒక వార్త చక్కర్లు కొడుతుంది.. అతనికి ఎన్ని కోట్ల ఆస్తి ఉంది, సినిమాలు కాకుండా ఏం బిజినెస్ లు చేస్తున్నాడు అని జనాలు తెగ వెతుకుతున్నారు..

 Vijay Deverakonda
Vijay Deverakonda

అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లోనే అటు నార్త్ లో కూడా పాపులారిటీ దక్కించుకున్నారు. వరుస సినిమాలు చేస్తూ సక్సెస్ఫుల్గా దూసుకుపోతున్న ఈయన ఇటీవల ఖుషి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇక ఇందులో సమంత హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే విజయ్ దేవరకొండ సినిమాలతోనే పాపులారిటీ దక్కించుకోలేదు.. అటు వ్యాపారాలలో కూడా సక్సెస్ అయ్యారు.. ఈ క్రమంలోనే ఆయన దగ్గర ఉన్న లగ్జరీ కార్ల లిస్టు చూస్తే మాత్రం నిజంగా ఆశ్చర్య పోవాల్సిందే..

విజయ్ దేవరకొండ గ్యారేజీలో స్వీడన్ బ్రాండ్ కారు వోల్వో ఎక్స్ సీ 90 కూడా ఉంది. దీని దేశీయ ధర మార్కెట్లో రూ.1.31 కోట్ల వరకు ఉంటుంది. వోల్వో కంపెనీ భారత దేశంలో విక్రయిస్తున్న అత్యంత విలాసవంతమైన సురక్షితమైన కార్లలో ఇది కూడా ఒకటి. అలాగే ఒకప్పటి నుంచి ఎంతో ప్రజాధరణ పొందిన అమెరికన్ కారు తయారీ సంస్థ ఫోర్డ్.. గత ఏడాది క్రితం నుంచి మన భారతదేశంలో తన కార్యకలాపాలను నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే గ్లోబల్ మార్కెట్లో విక్రయిస్తున్న.. ఫోర్డ్ మస్టాంగ్ విజయ్ దేవరకొండ గ్యారేజీ లో ఉంది.. ఇవే కాదు.. మెరిసిడెస్ బెంజ్ జి ఎల్ సి, రేంజ్ రోవర్ బీఎండబ్ల్యూ ఫైవ్ సిరీస్ కూడా ఈయన సొంతం. ఈయన దగ్గర ఉన్న కార్ల విలువ రూ.5 కోట్లకు పైగా ఉంటుందని చెప్పవచ్చు.. విల్లాలు కూడా ఉన్నాయి.. ప్రస్తుతం రెండు, మూడు సినిమాకు చేస్తున్నాడు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here