Shaakuntalam : టాలీవుడ్ పరువు తీసేలా ఉన్న ‘శాకుంతలం’ మొదటిరోజు వసూళ్లు!

- Advertisement -

Shaakuntalam : తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు సాంకేతికంగా హాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ కి ఏమాత్రం తీసిపోదు.గ్రాఫిక్స్ విషయం లో కానీ, టేకింగ్ విషయం లో కానీ గత నాలుగేళ్లలో ఎవ్వరూ ఊహించని స్థాయికి చేరుకుంది.భారీ బడ్జెట్ సినిమాలతోనే కాదు,పది కోట్ల రూపాయిల లోపు బడ్జెట్ తో కూడా అద్భుతమైన క్వాలిటీ రప్పించగలం అని నిరూపించిన ఇండస్ట్రీ ఇది.ఈ ఇండస్ట్రీ నుండి ఏదైనా సినిమా వస్తుంది అంటే కచ్చితంగా పక్క ఇండస్ట్రీ వాళ్ళు కూడా అంచనాలు పెట్టుకుంటారు.ఆ అంచనాలకు అందుకోలేకపోయిన ప్రాజెక్ట్స్ తీసిన పర్వాలేదు కానీ,టెక్నికల్ గా నాసిరకం సినిమాలను మాత్రం అందించకూడదు.అలా అందిస్తే ఫలితం ఎలా ఉంటుందో నిన్న విడుదలైన ‘శాకుంతలం’ మూవీ ఉదాహరణ.

Shaakuntalam
Shaakuntalam

భారీ బడ్జెట్ తో సుమారుగా మూడేళ్ళ నుండి తెరకెక్కుతున్న సినిమాగా పేరు తెచ్చుకున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ కానీ, ట్రైలర్ కానీ ఆడియన్స్ ని ఆకట్టుకోలేదు.గ్రాఫిక్స్ చాలా నాసిరకంగా అనిపించాయి,అంత బడ్జెట్ పెట్టారంటే నమ్మశక్యంగా ఉండేట్టు ఎవరికీ అనిపించలేదు.ఇక విడుదల తర్వాత కూడా ఆడియన్స్ లో అలాంటి అనుభూతి కలిగింది.ఇండస్ట్రీ లో లెజండరీ స్థానాల్లో ఉన్న ప్రముఖుల నుండి ఇలాంటి ఔట్పుట్ ఎలా వచ్చింది అని ఆడియన్స్ సైతం నోరెళ్లబెట్టారు.ఫలితంగా దారుణమైన ఓపెనింగ్ వచ్చింది, ఒక మీడియం రేంజ్ హీరో సినిమాకి వచ్చేంత ఓపెనింగ్ లో పావు శాతం కూడా రాబట్టలేకపోయింది.మొదటి రోజు ఈ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాము.

samantha
samantha

ఈ చిత్రం విడుదలకు రెండు రోజుల ముందు హైదరాబాద్ లో ప్రివ్యూ షో వేశారు, ఈ షో నుండే ఈ సినిమాకి కాస్త డివైడ్ టాక్ వచ్చింది.విడుదల తర్వాత సర్దుకుంటుందిలే అని అందరూ అనుకున్నారు.కానీ మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది.సమంత కి ఉన్న స్టార్ స్టేటస్ వల్ల ప్రారంభ షోస్ పర్వాలేదు అనే రేంజ్ వసూళ్లను రాబట్టినా, మాట్నీస్ నుండి టాక్ ప్రభావం వల్ల వసూళ్లు దారుణంగా పడిపోయాయి.రెండు తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే ఓవర్సీస్ లో కాస్త మెరుగైన వసూళ్లు వచ్చాయి.సమంత ని ట్రేడ్ అక్కడ ఓవర్సీస్ క్వీన్ అని అంటుంటారు.ఈమెకి ఉన్నన్ని 1 మిలియన్ సినిమాల కౌంట్ స్టార్ హీరోలకు కూడా లేదు, ఆ బ్రాండ్ ఇమేజి వల్ల మొదటి రోజు ప్రీమియర్ షోస్ తో కలిపి లక్ష 25 వేల డాలర్లను వసూలు చేసింది.

- Advertisement -

ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లు రెండు కోట్ల రూపాయిల షేర్ లోపే ఉందట.ఒక ఈవెంట్ సినిమాకి ఇంత తక్కువ వసూళ్లు రావడం అంటే టాలీవుడ్ పరువు తీసినట్టే.మహాభారతం లోని అద్భుతమైన ఘట్టాన్ని ఎంచుకొని సినిమా తీసినప్పుడు కచ్చితంగా ఆడియన్స్ లో అంచనాలు భారీగానే ఉంటాయి, కానీ ఈ సినిమా ఆ అంచనాలను తారుమారు చేసింది.సినిమా తీసే శక్తి లేకపోతే ఆపేయండి కానీ, ఇలాంటి నాసిరకపు క్వాలిటీ తో అవుట్ డేటెడ్ టేకింగ్ తో తెలుగు సినిమా పరువు తియ్యొద్దు అంటూ గుణ శేఖర్ కి సోషల్ మీడియా ద్వారా తెలియచేస్తున్నారు నెటిజెన్స్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here